Page Loader
WTC: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27..టీమిండియా షెడ్యూల్ ఇదే 
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27..టీమిండియా షెడ్యూల్ ఇదే

WTC: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27..టీమిండియా షెడ్యూల్ ఇదే 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లో పాల్గొనాలన్న టీమిండియాకు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత్‌ 1-3తో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీని ద్వారా టీమ్‌ఇండియా 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో విజయం సాధించి, తుది పోరుకు అర్హత సాధించింది. ఈ ఫైనల్‌ జూన్‌ 11 నుంచి ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌ మైదానంలో దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.

వివరాలు 

ఇంగ్లాండ్ పర్యటనతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ప్రస్థానం

అలాగే, ఈ ఏడాది జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సీజన్ ప్రారంభమవ్వనుంది. ఈ సందర్భంగా, వచ్చే డబ్ల్యూటీసీలో టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్‌ కూడా వెలువడింది. ఈ షెడ్యూల్ ప్రకారం, భారత్ మొత్తం 18 టెస్టులు ఆడనుంది. వాటిలో 9 టెస్టులు స్వదేశంలో, మిగతా 9 టెస్టులు విదేశాల్లో నిర్వహించబడతాయి. ఇంగ్లాండ్‌తో 5, వెస్టిండీస్‌తో 2, సౌతాఫ్రికాతో 2, శ్రీలంకతో 2, న్యూజిలాండ్‌తో 2, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు నిర్వహించబడతాయి. టీమ్‌ఇండియా 2025లో ఇంగ్లాండ్ పర్యటనతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ప్రస్థానం ప్రారంభించనుంది. 2027 జనవరి-ఫిబ్రవరిలో స్వదేశంలో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌తో భారత్‌ మ్యాచ్‌లు ముగుస్తాయి.

వివరాలు 

డబ్ల్యూటీసీ 2025-27.. టీమ్‌ఇండియా షెడ్యూల్ 

టీమ్‌ఇండియా ఇంగ్లాండ్ టూర్: 5 టెస్టులు, జూన్-ఆగస్టు 2025 వెస్టిండీస్ భారత పర్యటన: 2 టెస్టులు, అక్టోబర్ 2025 దక్షిణాఫ్రికా భారత పర్యటన: 2 టెస్టులు, నవంబర్-డిసెంబర్ 2025 టీమ్‌ఇండియా శ్రీలంక టూర్: 2 టెస్టులు, ఆగస్టు 2026 టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ టూర్‌ : 2 టెస్టులు, అక్టోబర్-డిసెంబర్ 2026 ఆస్ట్రేలియా భారత పర్యటన: 5 టెస్టులు, జనవరి-ఫిబ్రవరి 2027