IND vs WI : సిరీస్ ఎవరిది.. నువ్వా నేనా సై
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందని అంతా ఎన్నో అంచనాలతో ఊహాల్లో తేలిపోయారు. కానీ మైదానంలోకి దిగాక టీమిండియా తేలిపోయింది. ట్రినిడాడ్ వేదికగా కీలక మూడో వన్డే నేటి సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఒత్తిడిలో సిరీస్ విజయంపై భారత్ జట్టు దృష్టిపెట్టింది. మరోవైపు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని విండీస్ భావిస్తోంది.ఇటీవలే క్వాలిఫయర్స్‌లోనూ విండీస్ ఘోర ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. భారత్‌పై స్వదేశంలో సిరీస్ నెగ్గి ఊరట పొందాలని ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ కరేబియన్ జట్టు ఓటమి పాలైనా కొత్తగా నష్టపోయేదేం లేదు.ఈ క్రమంలోనే గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తుందనడంలో సందేహం లేదు. మూడో మ్యాచ్ కోసం తుది జట్టులో ఆతిథ్య జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చని అంచనా.
బ్రియాన్ లారా స్టేడియంలో తొలి పురుషుల వన్డేకు సర్వం సిద్ధం
తరోబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో నేడు తొలి పురుషుల వన్డే జరగనుంది. బౌలింగ్‌కి అనుకూలించే పిచ్ లో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంది. పేసర్లూ విజృభించేందుకు వీలుంది. బౌండరీలు దగ్గరగా ఉన్నందున క్రీజులో నిలదొక్కుకుంటే భారీ పరుగులు సాధించే వీలుంది. మరో 6 వికెట్లు తీస్తే వన్డేల్లో 200 వికెట్ల క్లబ్ లో జడేజా చేరనున్నాడు.కపిల్ దేవ్ తర్వాత 2000 రన్స్ సహా 200 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జడ్డు ఘనత సాధించనున్నాడు. తుదిజట్లు (అంచనా) : భారత్: ఇషాన్, గిల్, శాంసన్, సూర్యకుమార్, కోహ్లి/రోహిత్/అక్షర్,హార్దిక్, జడేజా, శార్దూల్, ముకేశ్, కుల్‌దీప్, ఉమ్రాన్. వెస్టిండీస్: కింగ్, మేయర్స్, అథనేజ్, హోప్, హెట్‌మయర్, కార్టీ, షెఫర్డ్, కరియా, అల్జారి జోసెఫ్, మోటీ, సీల్స్.