IND Vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. గెలుపు అవకాశాలు ఆ జట్టుకే ఎక్కువే!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి వన్డే ప్రపంచ కప్‌లో పోటీ పడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రపంచ కప్‌లో టీమిండియాను కివీస్ ఓడించిన విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా కివీస్‌పై పగ తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. గత రెండు ప్రపంచకప్‌లలో భారత్ సెమీఫైనల్‌లో ఓటమిపాలైంది. సొంతగడ్డపై ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.
అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ
ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీస్ రౌండ్లలో భారత్ 3 విజయాలు, 4 పరాజయాలతో 42.86 విజయశాతాన్ని నమోదు చేస్తే..న్యూజిలాండ్ 2 విజయాలు, 6 పరాజయాలతో 25 శాతం మాత్రమే విజయశాతంతో నిలిచింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా (594) టాప్ స్కోరర్ గా కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 503, శ్రేయస్ 421 పరుగులతో జట్టును ముందుకు నడిపిస్తున్నారు. మరోవైపు గిల్, రాహుల్ కూడా కీలక సమయాల్లో రాణిస్తున్నారు. మిడిలార్డర్ సూర్యకుమార్, జడేజా బ్యాటింగ్ భారత్ కు అదనపు బలం చేకూరనుంది. న్యూజిలాండ్ జట్టు రచిన్ రవీంద్ర 535 పరుగులతో మూడోస్థానంలో ఉండగా, డరైల్ మిచెల్ కూడా 418 పరుగులు సాధించాడు. ఇక కాన్వే 359 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు.
న్యూజిలాండ్ పై భారత్ కు మంచి రికార్డు
మిడిలార్డర్‌లో ఫిలిప్స్, చాప్ మన్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక ఆరంభంలో ట్రెంట్ బౌల్ట్ చెలరేగితే భారత్ కు కష్టాలు తప్పవు. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 117 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్‌ల్లో భారత్... 50 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఒక మ్యాచ్ 'టై' అయింది. 7 మ్యాచ్‌లు రద్దయ్యాయి. భారత్ జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమీ, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. న్యూజిలాండ్ జట్టు విలియమ్సన్ (కెప్టెన్), కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, చాప్‌మన్, సాన్‌ట్నర్, సౌతీ, ఫెర్గూసన్, బౌల్ట్.