Smriti Mandhana: స్మృతి మంధాన ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?.. నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మెన్స్ క్రికెట్‌లో భారత్ డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇటీవల భారతదేశంలో మహిళల క్రికెట్ టీమ్‌కు ఫాలోయింగ్ పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని మహిళా క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. వారిలో స్మృతి మంధాన ప్రత్యేకమైన వ్యక్తి. ఆమె భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్నది, అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపిఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. స్మృతికి ఇండియాలో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ స్టార్ ఉమెన్ క్రికెటర్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం, సంపాదన, ఇతర వివరాలపై ఒక నజర్ వేద్దాం.
చిన్న వయసులోనే క్రికెట్ పై ఆసక్తి
స్మృతి మంధాన భారత మహిళల క్రికెట్ టీమ్‌లో కీలకమైన ప్లేయర్.ఆమె అగ్రెసివ్ బ్యాటింగ్ శైలికి, నాయకత్వ నైపుణ్యాలకు అనేక మంది ఫిదా అవుతారు. 1996, జులై 18న ముంబైలో జన్మించిన స్మృతి, చిన్న వయసులోనే క్రికెట్ పై ఆసక్తి పెంచుకుంది. తండ్రి శ్రీనివాస్, జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడిన ఆమె సోదరుడు శ్రవణ్ ప్రోత్సాహంతో స్మృతి చిన్న వయసులోనే క్రికెట్‌లో ప్రతిభను ప్రదర్శించింది. కేవలం 9 సంవత్సరాల వయసులోనే ఆమె మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికైంది. 11 సంవత్సరాల వయసులో అండర్-19లో ఆడింది. ఈ ప్రస్థానం ఆమె ఇంటర్నేషనల్ కెరీర్‌కు బలమైన పునాదిగా మారింది. 2013లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో స్మృతి అంతర్జాతీయ క్రికెట్ లో ఎంటర్ అయ్యింది.
టీ20 స్కోరర్స్ జాబితాలో రెండో స్థానం
ఆమె ప్రదర్శనతో జాతీయ జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. చాలా సంవత్సరాలుగా ఆమె దూకుడు,స్టైలిష్ బ్యాటింగ్ ద్వారా మంచి పరుగులు సాధిస్తోంది. ఇండియా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెట్ దిగ్గజాల్లో మిథాలీ రాజ్,హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాత మూడో స్థానంలో స్మృతి ఉంది. హయెస్ట్ టీ20 స్కోరర్స్ జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని పొందింది. స్మృతి 2018,2021లో ICC మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా రెండుసార్లు ఎంపికైంది.అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. 2024లో, స్మృతి మంధాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కి మొదటి WPL టైటిల్‌ను అందించింది. బ్యాటర్ గా కాకుండా,కెప్టెన్ గా కూడా రాణించింది. కొన్ని నివేదికలు స్మృతి మంధాన నెట్ వర్థ్ $4 మిలియన్ల(సుమారు రూ.33 కోట్లు)గా పేర్కొంటున్నాయి.
ఇతర ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్స్‌లో స్మృతి
ఆమె సంపాదన మ్యాచ్ ఫీజులు, లీగ్ కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా వస్తుంది. మంధాన BCCI వార్షిక కాంట్రాక్ట్ ద్వారా సంవత్సరానికి రూ.50 లక్షలు పొందుతోంది. WPL (RCB) నుండి ఆమె ఒక్కో సీజన్‌కు రూ.3.4 కోట్లు సంపాదిస్తుంది. ఒక్కో టెస్ట్ మ్యాచ్ ఫీజు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్ ఫీజు రూ.6 లక్షలు, టీ20ఐ మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలు అందుకుంటోంది. స్మృతి ఇతర ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్స్‌లో కూడా ఆడుతోంది.ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL),ది హండ్రెడ్ వంటి అంతర్జాతీయ లీగ్‌లలో ఆడి భారీగా డబ్బు సంపాదిస్తోంది. ఆమె హీరో మోటోకార్ప్,బాటా,బూస్ట్,హ్యుందాయ్ వంటి ప్రధాన కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోంది.ఈ ఒప్పందాలతో ఆమె ఆదాయం గణనీయంగా పెరిగింది.