
Taskin Ahmed: ప్రపంచంలో భారత ఆటగాళ్లే బెస్ట్.. వారు అన్ని పరిస్థితుల్లోనూ బాగా బ్యాటింగ్ చెయ్యగలరు: తస్కిన్ అహ్మద్
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెటర్ల (Team India)అసాధారణ ఆటతీరు బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లు భారత్‌లో ఉన్నారని పేర్కొన్నాడు.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా అద్భుతంగా రాణించే సామర్థ్యం వారిలో ఉందని చెప్పారు. భారత్‌పై జరిగిన రెండో టీ20లో బౌలర్లు కొంత కట్టడి చేసినా, తరువాత చేతులెత్తేశారు.
మ్యాచ్ అనంతరం తస్కిన్ మాట్లాడుతూ,"ప్రపంచంలో వారే (భారత క్రికెటర్లు) బెస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారు కేవలం హోం గ్రౌండ్స్‌లోనే కాదు,ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరు.వారు మాకంటే అనుభవజ్ఞులు,మెరుగైన ఆటగాళ్లు.పవర్ ప్లేలో మేము మెరుగ్గా రాణించాం.కానీ,చివర్లో వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.దురదృష్టవశాత్తు మా స్పిన్నర్లకు దుర్దినం.సాధారణంగా ఈ స్థాయిలో విఫలమవ్వరు.కానీ,ఇది టీ20 క్రికెట్. ఏమైనా జరగొచ్చు" అని తెలిపారు.
వివరాలు
క్యాచ్‌లు జారవిడిస్తే, భారత్ వంటి ప్రత్యర్థిపై భారీ మూల్యం చెల్లించాలి: తస్కిన్
దిల్లీ మైదానం భారీ స్కోర్లకు ప్రసిద్ధిగా ఉంది. ఇక్కడ సగటు 200కి పైగా ఉంది. మేము మాత్రం మా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాం.
రెండు మంచి బ్యాటింగ్ ట్రాక్‌లే. జట్టుగా మా సామర్థ్యానికి తగ్గట్లు ఆడలేదనే భావన కలుగుతోంది.
ఎప్పుడైనా క్యాచ్‌లు జారవిడిస్తే, భారత్ వంటి ప్రత్యర్థిపై భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తక్కువగా ఉన్నా, అది భారీ మూల్యం చెల్లించాల్సిందే" అని తమ జట్టు ఆటతీరును విశ్లేషించాడు.
ముఖ్యంగా మైదానంలో డ్యూ కారణంగా స్పిన్నర్లకు బంతిపై పట్టు లభించక విఫలమైనట్లు అభిప్రాయపడ్డాడు.
వివరాలు
లక్ష్య ఛేదనలో చతికిలపడిన బంగ్లా
సూపర్‌ఫామ్‌లో ఉన్న టీమిండియా బుధవారం రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
నితీష్ కుమార్ రెడ్డి (74), రింకూ సింగ్ (53) చెలరేగడంతో భారత్ 9 వికెట్లకు 221 పరుగులు సాధించింది.
హార్దిక్ (32) కూడా రాణించాడు. లక్ష్య ఛేదనలో బంగ్లా చతికిలపడింది. భారత బౌలర్ల ధాటికి 9 వికెట్లకు 135 పరుగులు మాత్రమే సాధించింది.
వరుణ్ చక్రవర్తి (2/19), నితీష్ (2/23), అభిషేక్ (1/10), మయాంక్ యాదవ్ (1/30), అర్ష్‌దీప్ (1/26) బంగ్లాను కట్టడి చేశారు.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సంపాదించింది. ఆఖరి టీ20 శనివారం హైదరాబాద్‌లో జరగనుంది.