LOADING...
ICC Rankings : ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత్ ప్లేయర్లు సత్తా.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్అ న్నింట్లోనూ టాప్!
ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత్ ప్లేయర్లు సత్తా.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్అ న్నింట్లోనూ టాప్!

ICC Rankings : ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత్ ప్లేయర్లు సత్తా.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్అ న్నింట్లోనూ టాప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఆటగాళ్లు, ఐసీసీ (ICC) తాజా ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు. ఇప్పటికే బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య అగ్రస్థానాల్లో నిలవగా.. ఇప్పుడు బౌలింగ్‌లోనూ భారత్‌కే టాప్ ర్యాంక్ దక్కింది.

Details

టాప్ లో వరుణ్ చక్రవర్తి

తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (733 పాయింట్లు) టీ20 బౌలింగ్‌లో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చూపడంతో ఈ ఘనత సాధించాడు. దీంతో భారత్ తరఫున టాప్‌ ర్యాంక్ సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ ఈ రికార్డు సాధించారు. ప్రస్తుతం జాకబ్ డఫీ (717), అకీల్ హుసేన్ (707), ఆడమ్ జంపా (700), అదిల్ రషీద్ (677)వరుసగా టాప్‌-5లో ఉన్నారు. కాగా, గత కొన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు దూరమైన రవి బిష్ణోయ్ రెండు స్థానాలు తగ్గి 8వ స్థానంలో నిలిచాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు మెరుగుపరుచుకుని 23వ ర్యాంక్‌లోకి ఎగబాకాడు.

details

 బ్యాటింగ్‌లో అభిషేక్ దూకుడు 

బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ (884) తన స్థాయిని బలపరచుకున్నాడు. దక్షిణాఫ్రికాపై శతకంతో అదరగొట్టిన ఫిల్ సాల్ట్ (838), దూకుడు చూపిన జోస్ బట్లర్ (794) కూడా ర్యాంకులు పెంచుకున్నారు. అయితే, తిలక్ వర్మ (792) నాలుగో స్థానానికి జారిపోయాడు. పాక్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ (747) ఒక స్థానం తగ్గి ఏడవ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్లలో హార్దిక్ టాప్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్య (237) అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అక్షర్ పటేల్ (163) రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 12వ ర్యాంక్‌కు చేరాడు. అభిషేక్ శర్మ (161) నాలుగు స్థానాలు ఎగబాకి 14వ స్థానంలోకి వచ్చాడు.