LOADING...
Womens ODI World Cup 2025 : 2025 మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కు భార‌త జ‌ట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్.. 
కెప్టెన్‌గా హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్..

Womens ODI World Cup 2025 : 2025 మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కు భార‌త జ‌ట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెప్టెంబర్ 30 నుండి ప్రారంభంకానుంది.ఈ మహత్తర టోర్నీకి భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమ్ ఇండియా వన్డే ప్రపంచ కప్ క్రీడల్లో పాల్గొననుంది, కాగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్ పాత్రను నిర్వహించనుంది. ఓపెనింగ్‌లో నిలకడగా ఆడుతున్న ప్రతికా రావల్,హర్లీన్ డియోల్‌లు తమ స్థానాలను జట్టులో కొనసాగించాయి. గాయంతో జట్టుకు దూరంగా ఉన్న రేణుకా సింగ్‌కు అవకాశమిచ్చారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చూపిన క్రాంతి గౌడ్, శ్రీచరణిలకు కూడా సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.

వివరాలు 

2025కి ఆతిథ్యం వహించనున్న భారత్, శ్రీలంక దేశాలు

అయితే, స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుత ప్రపంచ కప్ జట్టులో శ్రీచరణి, అరుంధతి రెడ్డి ఇద్దరూ తెలుగు అమ్మాయిలు ఉన్నారు. భారత్, శ్రీలంక దేశాలు కలిసి మహిళల వన్డే ప్రపంచ కప్ 2025కి ఆతిథ్యం వహించనున్నాయి. ఇప్పటివరకు టీమ్ ఇండియా మహిళల వన్డే ప్రపంచ కప్‌ను సాధించలేదు. అందువల్ల, హర్మన్ నాయకత్వంలో మొదటిసారిగా ఈ కప్‌ను జయించాలనే కోరిక ఫ్యాన్స్‌లో ఉంది. ఇటీవలే వన్డే క్రికెట్‌లో భారత మహిళల జట్టు అద్భుతంగా ప్రదర్శన కనబరుస్తోంది. ఈ ఏడాది ఆడిన 11 వన్డేల్లో 9 విజయాలను సాధించడం గర్వకారణంగా ఉంది.

వివరాలు 

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 కోసం భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఇదే.. 

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యాస్తికా భాటియా (వికెట్ కీప‌ర్‌) స్నేహ రానా

వివరాలు 

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో టీమఇండియా షెడ్యూల్ ఇదే.. 

* సెప్టెంబ‌ర్ 25న - భార‌త్ వ‌ర్సెస్ శ్రీలంక *అక్టోబ‌ర్ 5 న - భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్‌ * అక్టోబ‌ర్ 9న - భార‌త్ వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా * అక్టోబ‌ర్ 12న - భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా * అక్టోబ‌ర్ 19న - భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్‌ * అక్లోబ‌ర్ 23న - భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్‌ * అక్టోబ‌ర్ 27న - భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ విమెన్ చేసిన ట్వీట్