
IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో స్పల్ప మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
చెపాక్ వేదికగా చైన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకూ పోరాడిన సీఎస్కే అఖరికి ఓటమిని చవిచూసింది.
చివరి బంతిని ధోని బౌండరీగా మలచలకపోవడంతో సీఎస్కే పరాజయం పాలైంది.అయితే ధోని పోరాట పటిమకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
రాజస్థాన్ గెలుపుతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు వచ్చాయి. నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిని గెలిచి రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగింది. రాజస్థాన్ రన్ రేట్ +1.588 గా ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. చెరో నాలుగు పాయింట్లతో కోల్ కత్తా మూడోస్థానం, గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో నిలిచాయి.
యుజేంద్ర చాహెల్
10 వికెట్లతో అగ్రస్థానంలో యుజేంద్ర చాహెల్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 225 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. 209 పరుగులతో డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో నిలిచాడు.
204 పరుగులతో జోస్ బట్లర్ మూడో స్థానం, 197 పరుగులతో రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
యుజేంద్ర చాహెల్ చైన్నై మ్యాచ్ లో రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. దీంతో మొత్తం ఈ సీజన్‌లో 10 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.
లక్నో బౌలర్ మార్క్ వుడ్ 9 వికెట్లతో రెండో స్థానంలో, రషీద్ ఖాన్ 8 వికెట్లతో మూడో స్థానంలో నిలిచారు.