
IPL 2025: ఎంఐ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ఖాతాలో 300 వికెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నపేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు.
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పోరులో అతను 300 టీ20 వికెట్లు పూర్తిచేసి ఈ ఘనతను సాధించాడు.
న్యూజిలాండ్‌కు చెందిన ఈ బౌలర్‌కు టీ20ల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.ప్రత్యేకించి పవర్‌ప్లే ఓవర్లలో వికెట్లు తీసే నిపుణుడిగా పేరు పొందాడు.
ఆర్ఆర్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో బౌల్ట్ మూడు కీలక వికెట్లు తీసి కేవలం 28 పరుగులే ఇచ్చాడు.
ఇప్పటి వరకూ ట్రెంట్ బౌల్ట్ 257 టీ20 మ్యాచ్‌లు ఆడి,25.10 సగటుతో మొత్తం 302 వికెట్లు తీసుకున్నాడు.
టీ20 క్రికెట్ చరిత్రలో 300కి పైగా వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్లలో అతను మూడవ స్థానంలో నిలిచాడు.
వివరాలు
ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆర్ ఆర్
అతని కంటే ముందు టిమ్ సౌథీ (343 వికెట్లు), ఇష్ సోథీ (310 వికెట్లు) ఈ ఘనత సాధించారు.
ప్రస్తుతం ఐపీఎల్‌లో ట్రెంట్ బౌల్ట్ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు.
గత ఐదు మ్యాచ్‌ల్లోనే అతను 11 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. పర్పుల్ క్యాప్ రేసులో మూడవ స్థానాన్ని ఆయన ఆక్రమించాడు.
గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇదే మ్యాచ్ ఫలితంగా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై జట్టు ఏడుసార్లు గెలిచి, నాలుగుసార్లు ఓడి అగ్రస్థానంలో నిలిచింది.
ప్రస్తుతం వారి ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్ ఆశలు కోల్పోయింది.