
MS Dhoni: ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత.. మహీ రికార్డు ఇప్పట్లో బద్దలయ్యే అవకాశమే లేదు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక ప్రత్యేకమైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా 150 క్యాచ్‌ల మైలురాయిని అందుకున్న మొదటి ఆటగాడిగా ధోనీ తన పేరును రికార్డుల్లో నమోదుచేశాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో నేహల్ వధేరా క్యాచ్‌ను పట్టుకోవడంతో ఈ అరుదైన రికార్డు మహీ ఖాతాలో చేరింది.
ప్రస్తుతం ఈ మైలురాయికి చేరుకున్న ఏ ఇతర వికెట్ కీపర్ ఐపీఎల్‌లో లేరు.
వివరాలు
150 క్యాచ్‌లు వికెట్ కీపర్‌గా..
మొత్తంగా 43 ఏళ్ల ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 154 క్యాచ్‌లు అందుకున్నాడు.
అందులో 150 క్యాచ్‌లు వికెట్ కీపర్‌గా ఉండగా, మిగిలిన నాలుగు క్యాచ్‌లు ఫీల్డర్‌గా సాధించాడు.
వికెట్ కీపింగ్ క్యాచ్‌ల పరంగా మహీ తరువాత స్థానంలో మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ఉన్నాడు, అతడు 137 క్యాచ్‌లు పట్టుకున్నాడు.
ఆ తరువాత వరుసగా వృద్ధిమాన్ సాహా (87 క్యాచ్‌లు), రిషబ్ పంత్ (76), క్వింటన్ డికాక్ (66) ఉన్నారు.
అయితే కార్తీక్ ఇప్పటికే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో, ధోనీ రికార్డు త్వరలో ఎవరు తిరగరాయలేరు అనే విషయం స్పష్టమవుతుంది.
వివరాలు
మెరుపు సెంచరీ సాధించిన ప్రియాంశ్ ఆర్య
ఇదిలా ఉంటే,పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవిచూసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
ఇందులో ప్రియాంశ్ ఆర్య 42 బంతుల్లో 103 పరుగులతో మెరుపు సెంచరీ సాధించగా,శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (2 వికెట్లు 45 పరుగులకు),రవిచంద్రన్ అశ్విన్ (2 వికెట్లు 48 పరుగులకు) ఒకింత ప్రభావం చూపారు.
వివరాలు
లక్ష్య ఛేదనలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్
లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమై ఓడిపోయింది.
డెవాన్ కాన్వే 49 బంతుల్లో 69 పరుగులతో రాణించగా, రచిన్ రవీంద్ర 23 బంతుల్లో 36 పరుగులు చేశారు.
అంతేకాక, మహీ కూడా చివర్లో 12 బంతుల్లో 27 పరుగులు (4 బౌండరీలు, 3 సిక్సర్లు) చేసి అభిమానులను అలరించాడు.