
IPL 2025: ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుండి ఇప్పటిదాకా ఆడిన ఆటగాళ్ళు వీళ్ళే..
ఈ వార్తాకథనం ఏంటి
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 18సీజన్లలో ఆడిన క్రికెటర్లెవరో ఇప్పుడు చూద్దాం.
ఈజాబితాలో తొలి స్థానంలో ఎం ఎస్ ధోనీ ఉన్నాడు.ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పుడు అతను చెన్నైసూపర్ కింగ్స్ జట్టులో ఆడేవాడు.
2016,2017 సీజన్లలో సీఎస్కే సస్పెన్షన్‌కు గురికావడంతో, ఎంఎస్ ధోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు.
విరాట్ కోహ్లీ 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)జట్టులో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు.
ఇప్పుడు,18వసీజన్‌లో కూడా అతను అదే జట్టుకు ఆడుతున్నాడు.ఐపీఎల్‌లో అన్ని సీజన్లలోనూ ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు కోహ్లీనే.
రోహిత్ శర్మ తన ఐపీఎల్ ప్రయాణాన్ని2008లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ప్రారంభించాడు.2009లో అదే జట్టుతో తన తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్నాడు.
వివరాలు
ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్
2011 నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్, ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిపించాడు.
రవీంద్ర జడేజా 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2011 సీజన్‌లో కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున ఆడాడు.
2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న జడేజా, 2016, 2017లో సీఎస్కే నిషేధానికి గురికావడంతో గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు.
అజింక్య రహానే తన ఐపీఎల్ కెరీర్‌లో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
ప్రస్తుతం, అతను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.