IPL 2025: ఐపీఎల్ 2025లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ క్రికెటర్ ఎవరెంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. వేలం కోసం క్రికెటర్ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సోమవారంతో ముగిసింది. ఈ సారి కొందరు క్రికెటర్లు మెగా వేలంలో భారీ ధరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే, రిటెన్షన్ ప్రక్రియలోనే కొందరు ప్లేయర్లకు ఫ్రాంచైజీలు పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేశాయి.
అత్యంత ఖరీదైన ఆటగాడిగా సౌతాఫ్రికా బ్యాటర్
ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు అత్యంత ఖరీదైన ఆటగాడిగా సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈ స్టార్ క్రికెటర్‌ను రిటేన్ చేసుకునేందుకు రూ. 23 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించింది. గత సీజన్‌లో క్లాసెన్ SRH జట్టులో కీలక ఆటగాడిగా నిలిచి, 16 మ్యాచ్‌ల్లో 39.92 యావరేజ్, 171.07 స్ట్రైక్ రేట్‌తో 479 పరుగులు చేశాడు. కోర్ ప్లేయర్లను కంటిన్యూ చేయడంలో ఇతర జట్లు కూడా ముందుకు వచ్చాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీని రూ. 21 కోట్లకు రిటేన్ చేసుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను అదే మొత్తానికి కొనసాగించింది.
ఐపీఎల్ 2025 రిటెన్షన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు:
రూ. 23 కోట్లు: హెన్రిచ్ క్లాసెన్ రూ. 21 కోట్లు: విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ. 18 కోట్లు: రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, పాట్ కమిన్స్, రషీద్ ఖాన్ రూ. 16.5 కోట్లు: అక్షర్ పటేల్, శుభమన్ గిల్ ఈ విధంగా ఐపీఎల్ 2025లో రిటెన్షన్ ద్వారా ఫ్రాంచైజీలు తమ ప్రధాన ఆటగాళ్లను జట్టులో నిలుపుకోవడమే కాక, వారి విజయావకాశాలను మెరుగుపరచుకోవాలని చూస్తున్నాయి.