LOADING...
#Viral Movement : ఇబ్బందుల్లో రోహిత్.. తిలక్ సెలబ్రేషన్‌కు ఫిదా
ఇబ్బందుల్లో రోహిత్.. తిలక్ సెలబ్రేషన్‌కు ఫిదా

#Viral Movement : ఇబ్బందుల్లో రోహిత్.. తిలక్ సెలబ్రేషన్‌కు ఫిదా

వ్రాసిన వారు Moogati Shabari
May 15, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయినా, ముంబయి ఇండియన్స్ తమ పోరాటస్ఫూర్తిని మరోసారి నిరూపించింది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన యువ ఆటగాడు తిలక్ వర్మ, తన అద్భుత ఇన్నింగ్స్‌ను సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మకు అంకితం చేస్తూ చేసిన సెలబ్రేషన్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.

వివరాలు

రోహిత్ ఇబ్బందుల్లో.. తిలక్ బాధ్యత..

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 26 బంతులు ఎదుర్కొని కేవలం 25 పరుగులకే పరిమితమయ్యాడు. ధర్మశాల పిచ్‌పై టైమింగ్ అందక ఇబ్బంది పడుతున్న సమయంలో, తిలక్ వర్మ జట్టును ముందుండి నడిపించాడు. లక్ష్య ఛేదనలో చివరి ఐదు ఓవర్లకు 80 పరుగులు అవసరమైన దశలో అతడు దూకుడు పెంచాడు. యుజ్వేంద్ర చాహల్ వేసిన ఓవర్‌లో 20 పరుగులు రాబట్టిన తిలక్, మార్కో జాన్సెన్ ఓవర్‌లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముంబై వైపు మళ్లించాడు. చివరి ఓవర్‌లో బార్ట్లెట్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది, ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.

వివరాలు

తిలక్ సెలబ్రేషన్‌కు ఫిదా అయిన రోహిత్..

విజయం ఖరారైన వెంటనే తిలక్ వర్మ ఆనందంతో గాల్లోకి ఎగిరాడు. అనంతరం డగౌట్ వైపు తిరిగి చేతివేళ్లతో "45" అని సూచించాడు. అది రోహిత్ శర్మ జెర్సీ నంబర్ కావడం విశేషం. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న రోహిత్‌కు మద్దతుగా తిలక్ చేసిన ఈ గెస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన రోహిత్ శర్మ కూడా చిరునవ్వుతో స్పందించాడు. తన సీటు నుంచి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ తిలక్‌ను అభినందించాడు. ఇద్దరి మధ్య కనిపించిన ఈ అనుబంధం ముంబై అభిమానుల్లో ప్రత్యేక ఆనందాన్ని నింపింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న రోహిత్ శర్మ వీడియో..

Advertisement