LOADING...
RR vs MI: ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్.. రాజస్థాన్‌కు మరో విజయం దక్కుతుందా?
ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్.. రాజస్థాన్‌కు మరో విజయం దక్కుతుందా?

RR vs MI: ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్.. రాజస్థాన్‌కు మరో విజయం దక్కుతుందా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 07, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 7న 13వ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్, ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తున్న ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు సాగనుంది. ఈ మ్యాచ్ గువాహటిలోని వేదికపై రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పోరును స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. ఈ సీజన్‌ను సీఎస్‌కేపై గెలుపుతో ఘనంగా ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. ముంబై తొలి మ్యాచ్‌లో కోల్‌కతాపై ఘన విజయం సాధించినప్పటికీ, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు ఎదురులేక ఓటమిని చవిచూసింది. అందువల్ల ఈ మ్యాచ్ ముంబైకి ఎంతో కీలకంగా మారింది.

వివరాలు

రసవత్తరపోరులో గెలుపు ఎవరిది?

ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్లు పోటాపోటీగా ఆడినప్పటికీ, ముంబై 16 మ్యాచ్‌లలో గెలవగా, రాజస్థాన్ 14 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ముఖ్యంగా 2021 తర్వాత జరిగిన ఎనిమిది మ్యాచ్‌లలో ముంబై ఐదు విజయాలు సాధించి కొంత ఆధిపత్యాన్ని చూపించింది. రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురేల్ వంటి యువ ఆటగాళ్లు ఉత్సాహంగా రాణిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి అనుభవజ్ఞులు బలంగా కనిపిస్తున్నారు. యువతరం, అనుభవజ్ఞుల మధ్య జరిగే పోరులో గెలుపు ఎవరి వైపు ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

వివరాలు

జట్ల వివరాలు ఇవే..

రాజస్థాన్ రాయల్స్ అంచనా జట్టు: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, డొనోవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, బర్గర్, రవి బిష్ణోయ్. ముంబై ఇండియన్స్ అంచనా జట్టు: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే.

Advertisement