LOADING...
IPL 2026: ఇషాన్ కిషన్ మెరుపులు.. రాజస్థాన్‌ను మట్టికరిపించిన హైదరాబాద్
ఇషాన్ కిషన్ మెరుపులు.. రాజస్థాన్‌ను మట్టికరిపించిన హైదరాబాద్

IPL 2026: ఇషాన్ కిషన్ మెరుపులు.. రాజస్థాన్‌ను మట్టికరిపించిన హైదరాబాద్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 13, 2026
11:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపరకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు ఓటమి రుచి చూడని రాజస్థాన్, ఈ సీజన్‌లో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది. వరుసగా నాలుగు విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌కు సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఓటమి రుచి చూపించింది. రాజస్థాన్‌పై హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

వివరాలు

తొలి పరాజయం..

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 19 ఓవర్లలో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్‌కు ఈ సీజన్‌లో ఇది రెండో విజయం. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా, 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మరోవైపు రాజస్థాన్ 5 మ్యాచ్‌లు ఆడగా ఇదే తొలి పరాజయం కావడం విశేషం.

వివరాలు

బౌలర్లు ఇరగదీశారిలా..

హైదరాబాద్ జట్టులో కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన అతను 44 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక హైదరాబాద్ బౌలర్లలో హింగ్ , షకీబ్ హస్సన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇద్దరూ తలా 4 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలకంగా నిలిచారు. 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ప్రఫుల్ హింగే బౌలింగ్ ముందు RR బ్యాట్స్‌మెన్ పూర్తిగా తడబడిపోయారు. వరుసగా ముగ్గురు ఔట్ అయ్యారు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

Advertisement