Page Loader
Ishan Kishan: దులీప్ ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ 
దులీప్ ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్

Ishan Kishan: దులీప్ ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2024
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అక్కటుకున్నాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా బితో గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా సి తరఫున ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టాడు. కిషన్ 121 బంతుల్లో 14 ఫోర్లు,రెండు సిక్సర్ల సాయంతో ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఏడో సెంచరీ పూర్తి చేశాడు. గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌కు దూరమైన ఇషాన్,రెండో రౌండ్‌లో ఇండియా-సీ తరఫున ఆడేందుకు మైదానంలోకి వచ్చాడు. సహచరులు తక్కువ వ్యవధిలోనే అవుట్ అవుతుండగా, కిషన్ క్రీజులోకి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు.48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత, తన వేగాన్ని తగ్గించినా స్థిరంగా రాణించి శతకాన్ని నమోదు చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఏడో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ 

వివరాలు 

బుచ్చిబాబు టోర్నమెంట్‌లో గాయం 

దులీప్ ట్రోఫీలో ప్రారంభంలో ఇండియా-డీ జట్టుకు ఎంపికైన ఇషాన్,బుచ్చిబాబు టోర్నమెంట్‌లో గాయపడటంతో, అతని స్థానంలో సంజు శాంసన్‌ను బీసీసీఐ తీసుకుంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన ఆటగాళ్లు జట్లను వీడటంతో, మంగళవారం విడుదలైన అప్‌డేటెడ్ జాబితాలో ఇషాన్ పేరు లేకపోయినా,సీ జట్టు తరఫున ఆడే అవకాశాన్ని పొందాడు. ఇండియా-సీ టాస్ ఓడి బ్యాటింగ్ చేయగా,ఆరంభంలోనే సమస్యలు ఎదురయ్యాయి.

వివరాలు 

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కి గాయం

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.ఈ సమయంలో రజత్ పటిదార్ (40; 67 బంతుల్లో,8 ఫోర్లు)ఓపెనర్ సాయి సుదర్శన్ (43;75 బంతుల్లో, 8 ఫోర్లు) జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరూ అర్ధశతకానికి చేరువలోనే అవుట్ అవ్వడంతో,ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ వికెట్‌ తీసి ఇన్నింగ్స్‌కు అడ్డుకట్ట వేశారు. ఇలాంటి స్థితిలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, ఇంద్రజిత్ (62 నాటౌట్; 123 బంతుల్లో, 6 ఫోర్లు) సహకారంతో స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతానికి ఇండియా-సీ 64 ఓవర్లలో 272/2 స్కోరుతో నిలిచింది.