LOADING...
Wasim Akram: ఇక అతడ్ని టీమిండియా నుంచి తప్పించడం కష్టం : వసీం అక్రమ్ 
ఇక అతడ్ని టీమిండియా నుంచి తప్పించడం కష్టం : వసీం అక్రమ్

Wasim Akram: ఇక అతడ్ని టీమిండియా నుంచి తప్పించడం కష్టం : వసీం అక్రమ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2023
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమన్నది లేకుండా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్ధిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమైనా, టీమిండియాపై అతని ప్రభావం ఏ మాత్రం పడలేదని పేర్కొన్నారు. హార్ధిక్ పాండ్యా లేకపోయినా టీమిండియా పటిష్టంగా కనిపిస్తోందన్నారు. ఇక పాండ్యా కోలుకొని మళ్లీ జట్టులోకి వస్తే భారత జట్టు మరింత బలంగా మారుతుందని పేర్కొన్నారు.

Details

పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలి

న్యూజిలాండ్ పై అద్భుత బౌలింగ్ ప్రదర్శించిన మహ్మద్ షమీని టీమిండియా ఇక పక్కన పెట్టదని, గత నాలుగు మ్యాచుల్లో ఆడని షమీ ఒక్కసారిగా బరిలో దిగి రాణించడం అద్భుతమని అక్రమ్ కొనియాడారు. ఈనెల 29న ఇంగ్లండ్‌తో జరిగే పోరుకు పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం మంచిదని, అతడు కోలుకోకుండా బరిలోకి దిగడం మంచిది కాదన్నారు. కండరాల గాయాలు తగ్గినట్టే కనిస్తాయని, కానీ మైదానంలోకి దిగాక గాయం మళ్లీ తిరగబడుతుందని చెప్పారు. నూటికి నూరు శాతం పాండ్యా కోలుకున్నాకే ఆడించాలని సలహా ఇచ్చారు.