Ravindra Jadeja: వరల్డ్ కప్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ స్పిన్ బౌలర్‌గా రవీంద్ర జడేజా.. కుంబ్లే, యువరాజ్ రికార్డు బద్దలు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అదరగొడుతోంది.
ఈ టోర్నీలో బంతితో ఇరగదీస్తున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
ప్రపంచ కప్‌లో విజయవంతమైన ఇండియన్ స్పిన్నర్‌గా చరిత్రకెక్కాడు.
ఆదివారం నెదర్లాండ్స్ పై రెండు వికెట్లు పడగొట్టిన జడేజా, వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్‌లో భారత తరఫున అత్యధిక వికెట్లు(16) పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా రికార్డుకెక్కాడు.
ఇంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ పేరిట ఉంది.
1996 వరల్డ్ కప్‌లో కుంబ్లే, 2011 వరల్డ్ కప్‌లో యువరాజ్ 15 వికెట్లు తీశారు.
Details
జడేజా తర్వాతి స్థానంలో కుల్దీప్ యాదవ్
తాజాగా ఈ రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టి వరల్డ్ కప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఇండియన్ స్పిన్ బౌలర్‌గా నిలిచాడు.
ఈ టోర్నీలో కుల్దీప్ యాదవ్ 14 వికెట్లు పడగొట్టి రవీంద్ర జడేజా వెనకే నిలిచాడు.
ఇదిలా ఉండగా.. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో భారత్ 160 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.