Page Loader
షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్.. క్లారిటీ వచ్చేసింది
పీసీబీ ఛైర్మన్‌తో బీసీసీఐ కార్యదర్శి భేటీ

షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్.. క్లారిటీ వచ్చేసింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2023
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని నెలలుగా ఆసియా కప్‌పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియా, పాక్ మధ్య ముదురుతున్న ఈ వివాదం ఓ కొలక్కి వచ్చినట్లు సమాచారం. హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బీసీసీఐ కార్యదర్శి జైషా, పీసీబీ ఛైర్మన్ జకా అష్రాఫ్ బుధవారం రాత్రి సమావేశమైనట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. ముఖ్యంగా నేడు జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ను ఖారారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అరుణ్ ధుమాల్ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మీట్ కోసం డర్బన్‌లో ఉన్నారు.

Details

భారత్ ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలోనే

పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచులు, శ్రీలంక వేదికగా 9 మ్యాచులుగా జరగనున్నాయి. టీమిండియా, పాకిస్థాన్ మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌తో సహా లంకలోనే నిర్వహించనున్నారు. అయితే ఇటీవల పాక్ మంత్రి మజారీ చేసిన వ్యాఖ్యలపై ఈ భేటీ‌లో ఎలాంటి ప్రస్తావన జరగలేదు. ఈ సమావేశంలో షెడ్యూల్ పైనే చర్చ సాగిందని, దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17వరకు ఆసియా కప్ జరగనుంది. పూర్థిస్థాయి షెడ్యూల్ ను ఐసీసీ ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి.