Page Loader
James Anderson: 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్

James Anderson: 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 19, 2023
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్టు మ్యాచులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల వయస్సులోనూ అండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీని పెవిలియన్ చేర్చడం ద్వారా అండర్సన్ ఈ రికార్డును క్రియేట్ చేశాడు. ఆదివారం మొదటి సెషన్‌లో తన నాలుగో ఓవర్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న అలెక్స్ క్యారీ(66) ని క్లీన్ బౌల్డ్ చేశాడు. 2002లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకూ 289 మ్యాచులు ఆడాడు. ఇందులో 54 సార్లు 5 వికెట్ హాల్స్, 6 సార్లు 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి.

Details

అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అండర్సన్

ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి 2003లో అండర్సన్ అడుగు పెట్టాడు. ఇప్పటివరకూ 180 మ్యాచులు ఆడి 686 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 32 సార్లు 5 వికెట్ల హాల్స్, 3 సార్లు 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి. అదే విధంగా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ మూడో స్థానంలో నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఇంగ్లండ్‌కు చెందిన విల్‌ఫ్రెడ్ రోడ్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. విల్‌ఫ్రెడ్ 1110 మ్యాచుల్లో 4202 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కే చెందిన టిచ్ ఫ్రీమాన్ 592 మ్యాచుల్లో 3776 వికెట్లు తీశాడు.