Page Loader
Joe Root: టెస్టుల్లో జో రూట్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రూట్
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రూట్

Joe Root: టెస్టుల్లో జో రూట్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రూట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ జో రూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక శతకాలు కొట్టిన ఐదవ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో శతకం నమోదు చేసిన రూట్‌కి ఈ అరుదైన ఘనత లభించింది. ఈ శతకాల ర్యాంకింగులో చోటు దక్కించుకోవడంతో పాటు, టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌తో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉన్నరికార్డును అధిగమించాడు.

వివరాలు 

 టెస్టుల్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా జో రూట్ 

టెస్టు క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అతను టెస్టుల్లో మొత్తం 51 సెంచరీలు నమోదు చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వెస్ కల్లిస్ (45), ఆస్ట్రేలియన్ దిగ్గజం రికీ పాంటింగ్ (41), శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర (38) ఉన్నారు. ప్రస్తుతం రూట్ వీరిలో నాలుగవ స్థానంలో ఉన్నా, తన ఫామ్‌ ఇలాగే కొనసాగితే... ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో సంగక్కరను అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుత క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో టెస్టుల్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా జో రూట్ టాప్‌లో ఉన్నాడు.

వివరాలు 

అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు చేసిన బ్యాటర్‌క లిస్ట్: 

సచిన్ టెండూల్కర్ - 51 # జాక్వెస్ కల్లిస్ - 45 # రికీ పాంటింగ్ - 41 # కుమార్ సంగక్కర - 38 # జో రూట్ - 37 # రాహుల్ ద్రవిడ్ - 36 # స్టీవ్ సిత్ - 36