
ICC Test Rankings: ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ టెస్టులో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.
చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 91 పరుగులు చేసిన జో రూట్ రెండో స్థానానికి ఎగబాకాడు.
883 పాయింట్లతో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 859 పాయింట్లతో జో రూట్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవన్ స్మిత్ కొనసాగుతున్నాడు.
2023 యాషెస్‌లో 51.50 సగటుతో 412 పరుగులు చేసిన జో రూట్‌కు 859 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
యాషెస్ చివరి టెస్టులో వరుసగా 71, 54 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, మొత్తంగా 373 పరుగులు చేశాడు.
Details
నాలుగో స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం రెండు స్థానాలు ఎగబాకి (829 రేటింగ్ పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచాడు.
అదే సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లాబుస్చాగ్నే 826 రేటింగ్ పాయింట్లతో మూడు స్థానాలు దిగజారి ఐదో స్థానంలో నిలిచాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ఉస్మాన్ ఖవాజా 7వ స్థానం, ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ 9వ స్థానంలో చోటు దక్కించుకున్నారు.
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలర్ల కోసం ICC ODI ర్యాంకింగ్స్ జాబితాలో ఎనిమిది స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకోవడం విశేషం.
వరుసగా మూడు అర్ధశతకాలు బాదిన ఇషాన్ కిషన్ 15 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు.