England vs Srilanka: జో రూట్ 33వ టెస్ట్ సెంచరీ.. సాధించిన రికార్డులు ఇవే
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శతకం సాధించి..అత్యధిక శతకాల జాబితాలో 10వ స్థానానికి చేరాడు. ఈ శతకం రూట్‌కి 33వటెస్ట్ శతకం కాగా, మూడు ఫార్మాట్లలో కలిపితే ఇది 49వది.ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో,రూట్ అత్యధిక శతకాలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రూట్ ఈ కొత్త శతకంతో రోహిత్ శర్మను (48 శతకాలు) అధిగమించాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లి. అతని పేరిట 80 శతకాలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్‌గా రూట్,అలిస్టర్ కుక్ రికార్డును సమం చేశాడు.
ఫాబ్ ఫోర్ క్రికెటర్లలో 33 శతకాలతో ముందంజలో రూట్
ఈ జాబితాలో రూట్ (33),కుక్ (33),కెవిన్ పీటర్సన్ (23)మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. 2020లో కేవలం 17 టెస్ట్ శతకాలు చేసిన రూట్ తరువాత 44 నెలల వ్యవధిలోనే మరో 16 శతకాలు సాధించాడు. ఫాబ్ ఫోర్ క్రికెటర్లలో రూట్ అత్యధికంగా 33 శతకాలు సాధించి ముందంజలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ చెరో 32 శతకాలు సాధించగా, విరాట్ కోహ్లి 29 శతకాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
1-0 ఆధిక్యంలో ఇంగ్లండ్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో, లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. రూట్ 143 పరుగులు చేసి ఔట్ కాగా, గస్ అట్కిన్సన్ (74), మాథ్యూ పాట్స్ (20) ఇంకా క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌కు బెన్ డకెట్ (40), హ్యారీ బ్రూక్ (33), జేమీ స్మిత్ (21) మోడరేట్ స్కోర్లు అందించారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, లహీరు కుమార తలో రెండు వికెట్లు తీయగా, ప్రభాత్ జయసూర్య ఒక వికెట్ పడగొట్టాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే మొదటి టెస్ట్ గెలిచి, 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.