
Kane Williamson: 'పిచ్ వివాదం'పై కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి సెమీస్‌లో భారత్ చేతిలో న్యూజిలాండ్ 70 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే ఈ మ్యాచ్ చివరి నిమిషంలో పిచ్‌ను మార్చినట్లు బీసీసీఐపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
వీటిపై ఇప్పటికే ఐసీసీ కూడా స్పందించి, వివరణ ఇచ్చింది. తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించాడు.
మ్యాచ్ అనంతరం 'పిచ్ వివాదం'పై కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
పిచ్ విషయంలో తమకెలాంటి ఇబ్బంది లేదని, ఇరు జట్లకు అనుకూలంగానే ఉందని ఆయన పేర్కొన్నాడు.
Details
సెమీ ఫైనల్లో ఓడిపోవడం బాధగా ఉంది
తొలి అర్ధభాగంలో భారత బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టారని, పరిస్థితులకు తగ్గట్టుగా వారు ఆటతీరును మార్చుకున్నారని విలియమ్సన్ తెలిపాడు.
సెమీ ఫైనల్ మ్యాచులో ఇలా ఇంటిముఖం పట్టడం బాధగా ఉందని, గత ఏడు వారాలుగా అద్భుతమైన ప్రయాణం సాగించామన్నారు.
ఒక్క మ్యాచులో ఓటమి లేకుండా టీమిండియా ముందుకెళ్తుతోందని, ఫైనల్‌లో భారత్ ఇదే ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతుందనడంలో ఎటువంటి సందేహాం లేదన్నారు.
సెమీస్ మ్యాచులో కివిస్ ప్లేయర్లు చివరి పోరాడారని కేన్ విలియమ్సన్ కొనియాడారు.