
Karun Nair: రాహుల్, గిల్‌కు ఇచ్చినట్లే కరుణ్ నాయర్‌కు మరింత సమయం ఇవ్వాలి
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనకబడిన తరుణంలో, బ్యాటర్ కరుణ్ నాయర్ ప్రదర్శనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన అతను ఇప్పటి వరకు మూడు టెస్టులు ఆడి కేవలం 131 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ పరిణామంతో అతడిని మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పించాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. అయితే ఈ విమర్శల మధ్య భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం కరుణ్‌కు బాసటగా నిలిచాడు. ప్రతి ఆటగాడికి సరైన అవకాశాలు దక్కాలని ఆయన అభిప్రాయపడ్డాడు. 'అవును.. కరుణ్ నాయర్ పరుగులు తక్కువే చేశారు. కానీ, ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఆటగాడికి స్థిరంగా ఆడే స్థానం కల్పించాలి.
Details
కరుణ్ నాయర్ కు సమానంగా అవకాశాలు ఇవ్వాలి
శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి వారిని ఎన్నో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించినట్లే కరుణ్ నాయర్‌కు కూడా సమానంగా అవకాశాలు ఇవ్వాలి. ఐదు, ఆరు మ్యాచ్‌లు ఇతరులకు ఇచ్చినప్పుడు కరుణ్ చేసిన నేరం ఏంటి అని హర్భజన్ ప్రశ్నించారు. అంతేకాదు ఒకే ఒక్క టెస్టు ఆడి జట్టులోకి దూరిపోయిన సాయిసుదర్శన్ విషయానికీ ఆయన స్పందించారు. "ఒక మ్యాచ్ ఆధారంగా ఓ ఆటగాడి తీర్పు చెప్పడం సమంజసం కాదు. కరుణ్ నాయర్‌కు ఇప్పటికే మూడు అవకాశాలిచ్చారు కదా.. కాబట్టి మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌కు హర్భజన్ సూచించాడు.
Details
రేపే నాలుగో టెస్టు మ్యాచ్
ఇక బుధవారం (జూలై 23) నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరుగుతుంది. ఇది భారత్‌కు అత్యంత కీలకమైన పోరు. గెలిస్తే సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఓటమి లేదా డ్రా అయితే సిరీస్‌పై ఆశలు గల్లంతవుతాయి. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్నదానిపై అభ్యాసం, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కరుణ్ నాయర్‌కు మళ్లీ ఛాన్స్ ఇస్తారా? లేక సాయిసుదర్శన్‌కు రెండో అవకాశం కల్పిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.