
Mohammed Siraj : లార్డ్స్ ఓటమిపై కింగ్ చార్లెస్ స్పందన.. సిరాజ్ విషయంలో సానుభూతి!
ఈ వార్తాకథనం ఏంటి
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమి అనంతరం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కింగ్ చార్లెస్ భారత జట్టు పోరాటాన్ని ప్రశంసిస్తూ మహ్మద్ సిరాజ్ అవుట్ అయిన తీరుపై అవేదన వ్యక్తం చేశాడు. ఈ మీటింగ్ అనంతరం గిల్ మీడియాతో మాట్లాడుతూ, "కింగ్‌ను కలవడం ఒక గొప్ప అనుభూతి. మేము చాలా విషయాలు చర్చించాం. లార్డ్స్ మ్యాచ్ గురించి, ముఖ్యంగా సిరాజ్ అవుట్‌పై ఆయన విచారం వ్యక్తం చేశారు. 'ఆ బంతి స్టంప్‌లను తాకిందిగా.. మీరెలా ఫీల్ అయ్యారు?' అని ఆయన అడిగారు.
Details
సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ప్రత్యేక ఆతిథ్యం
మేము అది ఎంతో దురదృష్టకరమైన ఓటమిగా భావిస్తున్నామనీ, మ్యాచ్ ఏవైపునైనా తిరగవచ్చే స్థితిలో ఉందనీ చెప్పాం. మిగతా రెండు టెస్టుల్లో విజయం సాధిస్తామని రాజుకు నమ్మకం కలిగించామని గిల్ వివరించారు. ఈ సందర్భంగా కింగ్ చార్లెస్ III, భారత్ పురుషుల, మహిళల జట్లకు సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ప్రత్యేక ఆతిథ్యం అందించారు. పురుషుల జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పోటీపడుతుండగా, మహిళల జట్టు ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతోంది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు ఉత్కంఠతకెక్కింది. భారత్ 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ టాప్ ఆర్డర్ వైఫల్యం వల్ల 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
Details
22 పరుగుల తేడాతో ఓటమి
రవీంద్ర జడేజా (61), బుమ్రా, సిరాజ్ కలిసి ఓ దశలో ఆశలు రేపారు. చివరికి 22 పరుగులు మిగిలి ఉండగా సిరాజ్ తేలికపాటి తేడాతో అవుట్ కావడంతో భారత్ ఓటమి పాలైంది. అతని అవుట్ తీరు నెటిజన్లలో దారుణ నిరాశ కలిగించింది. మ్యాచ్ అనంతరం జో రూట్, క్రాలీ తదితర ఇంగ్లాండ్ ఆటగాళ్లు సిరాజ్‌ను ఓదార్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇది వారి క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ మ్యాచ్ గురించి గిల్ మాట్లాడుతూ ఇదొక గొప్ప టెస్టు మ్యాచ్. ఇరుజట్లు అసాధారణంగా పోరాడాయి. ఇది టెస్ట్ క్రికెట్ గొప్పతనాన్ని మరోసారి తెలియజేసిందని అన్నాడు.