కింగ్ కోహ్లీ vs మిస్టర్ కూల్.. చిన్నస్వామి స్టేడియంలో విజయం ఎవరిది?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సోమవారం కింగ్ కోహ్లీ, మిస్టర్ కూల్ తలపడనున్నాయి.
24వ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులైన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, చైన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనున్నాయి.బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30గంటలకు జరగనుంది.
వీరిద్దరి మధ్య పోరును చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. గత మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయిన చైన్నై ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.
మరోపక్క ఢిల్లీపై బెంగళూర్ విజయం సాధించి అత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది.
ఈ మైదానంలో చేజింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నందున మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకొనే అవకాశం ఉంటుంది.
చైన్నై
చైన్నై, బెంగుళూర్ జట్టులోని సభ్యులు
విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో సంచలన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలను సాధించాడు. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
చైన్నై టీంలో ఓపెనర్లు గైక్వాడ్, కాన్వే అద్భుతంగా రాణిస్తున్నారు. రహానే వేగంగా ఆడుతుండడం చైన్నైకి కలిసొచ్చే అంశం. ఇక జడేజా, మొయిన్‌అలీ ఆల్‌రౌండర్ విభాగంలో సత్తా చాటుతున్నారు.
(RCB): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, మాక్స్‌వెల్, అహ్మద్, దినేష్‌కార్తీక్ (WK), వేన్ పార్నెల్, హసరంగా, హర్షల్‌పటేల్, వైషాక్ విజయ్‌కుమార్, సిరాజ్
(CSK): డెవాన్ కాన్వే, గైక్వాడ్, రహానే, మొయిన్‌అలీ, రాయుడు, జడేజా, MS ధోని (c & wk), మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, ఆకాష్ సింగ్, దేశ్‌పాండే