ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన పాకిస్థాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది.
ఇక పాకిస్థాన్ (Nz vs Pak) ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ 60 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన పాకిస్థాన్ 260 పరుగులకే ఆలౌటైంది. పాకిస్తాన్ తరుపున ఖుష్‌దిల్ (69; 49 బంతుల్లో), బాబర్ అజమ్ (64; 90 బంతుల్లో) అత్యధిక పరుగులు చేశారు.
వివరాలు
నాలుగో వికెట్‌కు 114 పరుగుల విలువైన భాగస్వామ్యం
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.
కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్, టామ్ లాథమ్ అత్యద్భుతమైన శతకాలతో ఆకట్టుకున్నారు.
కేవలం 73 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను లాథమ్, యంగ్ తమ గొప్ప ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు.
ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 114 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించారు.
మొదట కొంత సంయమనంతో ఆడిన వీరు,క్రీజులో స్థిరపడిన తర్వాత పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు సాధించగా,లాథమ్ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 118 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వివరాలు
అఫ్రిదిని ఉతికారేశారు..
చివర్లో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 3 ఫోర్లు,4 సిక్సర్లతో 61 పరుగులు)మెరుపులు మెరిపించాడు.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (10),డార్లీ మిచెల్ (10),విలియమ్సన్ (1)విఫలమయ్యారు.
పాక్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్,నసీమ్ షా తలా రెండు వికెట్లు పడగొట్టగా,అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.
తన 10 ఓవర్ల కోటాలో అఫ్రిది 68 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.
గాయం నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి అఫ్రిది తన స్థాయికి తగ్గ ప్రదర్శన చూపించలేకపోతున్నాడు.
అతని బౌలింగ్‌లో పేస్ తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.అంతేకాకుండా,బంతిని స్వింగ్ చేయడంలో కూడా అతడు వెనుకబడ్డాడు.
మరోవైపు, హ్యారీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగలిగినప్పటికీ, 10 ఓవర్లలో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు.