Page Loader
DC vs CSK: రాణించిన కేఎల్ రాహుల్.. చైన్నై టార్గెట్ ఎంతంటే?
రాణించిన కేఎల్ రాహుల్.. చైన్నై టార్గెట్ ఎంతంటే?

DC vs CSK: రాణించిన కేఎల్ రాహుల్.. చైన్నై టార్గెట్ ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ చైన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు (ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు). అభిషేక్ పోరెల్ 20 బంతుల్లో 33 పరుగులు ( 4 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ అక్షర్ పటేల్ 15 బంతుల్లో 20 (ఒక ఫోర్, ఒక సిక్సర్), స్ట్రబ్స్ 11 బంతుల్లో 22 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.

Details

రాణించిన చైన్నై బౌలర్లు

చైన్నై బౌలర్లలో కలీల్ అహ్మద్, మహేష్ పతిరణ తలా రెండు పడగొట్టగా, నూర్ ఆహ్మద్ ఒక వికెట్ తీశారు. చివరి ఓవర్లో పతిరణ ఏడు పరుగులిచ్చి రెండు కీలక వికెట్ల పడగొట్టాడు. చైన్నై గెలవాలంటే 184 పరుగులు అవసరం

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హాఫ్ సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్