
GT VS DC: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో సిక్సర్ల డబుల్ సెంచరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన మైలురాయిని అధిగమించాడు.
అతను ఐపీఎల్‌లో 200 సిక్సర్లు పూర్తి చేసి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఘనతను అందుకున్న ఆరో భారత బ్యాటర్‌గా, మొత్తం మీద 11వ ఆటగాడిగా తన పేరు నమోదు చేసుకున్నాడు.
ఈ విజయాన్ని రాహుల్ ఏప్రిల్ 19న గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమోదు చేశాడు.
ఇప్పటివరకు ఐపీఎల్ పోటీల్లో రాహుల్ 129 ఇన్నింగ్స్‌లు ఆడి 200 సిక్సర్లు బాదాడు.
రాహుల్ కన్నా ముందు ఈ ఘనతను సాధించిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(286 సిక్సర్లు),విరాట్ కోహ్లి (282),ఎంఎస్ ధోని (260),సంజూ శాంసన్ (216),సురేశ్ రైనా (203)ఉన్నారు.
వివరాలు
మ్యాచ్ వివరాల్లోకి వెళితే…
అంతర్జాతీయంగా చూస్తే, క్రిస్ గేల్ (357), ఏబీ డివిలియర్స్ (251),డేవిడ్ వార్నర్ (236),కీరన్ పోలార్డ్ (223), ఆండ్రీ రసెల్ (212) కూడా ఐపీఎల్‌లో 200కు పైగా సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు.
ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.అతను 14 బంతుల్లో 4 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఓపెనింగ్ చేయడానికి వచ్చిన అభిషేక్ పోరెల్ 9 బంతుల్లో 18 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ 18 బంతుల్లో 31 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశారు.
వివరాలు
2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణ
వీరిద్దరూ ఆరంభంలో చురుకుగా ఆడినప్పటికీ భారీ స్కోర్లు చేయలేకపోయారు.
10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోరు 105/2గా ఉంది. అక్షర్ పటేల్ 15 పరుగులతో, ట్రిస్టన్ స్టబ్స్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
గుజరాత్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ద్ కృష్ణ చక్కటి ప్రదర్శనతో 2 వికెట్లు తీసుకున్నాడు. అర్షద్ ఖాన్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
వివరాలు
పాయింట్ల పట్టికపై ఓ లుక్కేస్తే…
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
పంజాబ్ 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ 7లో 4 గెలుపులతో నాలుగో స్థానంలో ఉంది.
లక్నో సూపర్‌జెయింట్స్ (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ముంబై ఇండియన్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), చెన్నై సూపర్‌కింగ్స్ వరుసగా ఐదవ నుండి పదవ స్థానాల వరకు కొనసాగుతున్నాయి.