
Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక
ఈ వార్తాకథనం ఏంటి
భారత జాతీయ క్రికెట్ జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. చిన్ననాటి స్నేహితురాలైన వంశికతో ఆయన వివాహబంధంలోకి ప్రవేశించనున్నారు. బుధవారం లక్నో నగరంలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ కార్యక్రమంలో కుల్దీప్,వంశికలు ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి. ఈ నిశ్చితార్థ వేడుకకు భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ సహా మరికొంతమంది ప్రముఖులు హాజరైనట్లు సమాచారం అందుతోంది.
వివరాలు
లక్నోలోని శ్యామ్ నగర్ లో ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్న వంశిక
వంశిక గురించి మాట్లాడితే, ఆమె ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతానికి ఆమె జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు.కుల్దీప్‌తో ఆమెకు చిన్ననాటి నుంచి ఉన్న స్నేహబంధం క్రమంగా ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న ఆత్మీయతను చూసిన కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించడంతో,ఈ నిశ్చితార్థం నిర్వహించారు. ఇక త్వరలోనే ఈ ప్రేమజంట వివాహబంధంతో ఒక్కటవనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక
Bowled over by love! 💍❤️
— Niche Sports (@Niche_Sports) June 5, 2025
Kuldeep Yadav gets engaged to his childhood friend Vanshika in a private ceremony in Lucknow.
Wishing the couple a lifetime of happiness ahead of the England tour. 🥂✨#KuldeepYadav #Engaged #CricketTwitter pic.twitter.com/rsNFochrfz