
MI vs LSG : ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18లో లక్నో సూపర్‌జెయింట్స్ రెండో విజయాన్ని సాధించింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది.
204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది.
ముంబయి తరఫున సూర్యకుమార్ యాదవ్ (67: 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) నమన్ ధీర్ (46: 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగైన ఆటతీరు కనబరిచారు.
చివరి ఓవర్లో విజయానికి 22 పరుగులు అవసరమైనప్పటికీ, ముంబయి కేవలం 9 పరుగులే చేయగలిగింది. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, దిగ్వేజ్, అవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.
Details
రాణించిన మిచెల్ మార్ష్, మార్‌క్రమ్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60: 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మార్‌క్రమ్ (53: 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి, జట్టుకు శుభారంభం ఇచ్చారు.
అయుష్ బదోనీ (30: 19 బంతుల్లో 4 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (27: 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించగా, కెప్టెన్ రిషబ్ పంత్ (2) మరోసారి విఫలమయ్యాడు.
అలాగే పూరన్(12), అబ్దుల్ సమద్(4), శార్దుల్ ఠాకూర్ (5*), ఆకాశ్ దీప్ (0), అవేశ్ ఖాన్ (2*) స్వల్ప స్కోర్లు మాత్రమే చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
12 పరుగుల తేడాతో లక్నో విజయం
Match 16. Lucknow Super Giants Won by 12 Run(s) https://t.co/HHS1Gsaw71 #LSGvMI #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 4, 2025