
GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలు ముగిసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి సంచలన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ జట్టు 33 పరుగుల తేడాతో గెలుపొందింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసి 2 వికెట్ల నష్టానికి భారీగా 235 పరుగులు నమోదు చేసింది.
లక్ష్యఛేదనలో దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పరిమితమైంది.
వివరాలు
కీలక మ్యాచ్‌లో తక్కువ పరుగులకే ఔట్ అయ్యిన గుజరాత్ కీలక ఆటగాళ్లు
ఈ సీజన్‌లో గుజరాత్ విజయాలకు మద్దతుగా నిలిచిన టాప్-3 బ్యాటర్లు..సాయి సుదర్శన్ (21; 16 బంతుల్లో 4 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (35; 20 బంతుల్లో 7 ఫోర్లు), జోస్ బట్లర్ (33; 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు).. ఈ కీలక మ్యాచ్‌లో ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు.
ఇంకా, రూథర్‌ఫోర్డ్(38; 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు),షారుక్ ఖాన్ (57; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.
రాహుల్ తెవాతియా కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యి నిరాశపర్చాడు
లఖ్‌నవూ బౌలర్లలో విలియం ఓ రూర్క్ అత్యుత్తమ ప్రదర్శనతో 3 వికెట్లు పడగొట్టగా,ఆయుష్ బదోని, అవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు.
వివరాలు
మార్క్రమ్,మార్ష్ 91పరుగుల భాగస్వామ్యం
ఆకాశ్ మహరాజ్, షాబాజ్ అహ్మద్ ఒక్కో వికెట్ అందించారు. బ్యాటింగ్‌లో లఖ్‌నవూ జట్టుకు మిచెల్ మార్ష్ ఘన విజయానికి బాటలు వేశాడు.
అతడు 64 బంతుల్లో 10 ఫోర్లు,8 సిక్సర్లతో 117పరుగులు చేసి అద్భుత శతకం నమోదు చేశాడు.
అతడితో పాటు నికోలస్ పూరన్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు చేసి జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు.
మార్క్రమ్ (36)రిషభ్ పంత్ (16; కేవలం 6 బంతుల్లో 2 సిక్సర్లు) కూడా విలువైన పరుగులు చేశారు.
మొదటి వికెట్‌కు మార్క్రమ్,మార్ష్ కలిసి 91పరుగుల భాగస్వామ్యం అందించగా,రెండో వికెట్‌కు మార్ష్, పూరన్ కలిసి మరో 121 పరుగులు జోడించారు.
గుజరాత్ బౌలర్లలో అర్షద్,సాయికిశోర్ చెరో వికెట్ తీసారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చిన లఖ్‌నవూ
Lucknow Super Giants won by 33 runs.
— Cricket.com (@weRcricket) May 22, 2025
LSG 235/2 (20)
GT 202/9 (20)#IPL2025 pic.twitter.com/3v7Z8Bnjvb