తదుపరి వార్తా కథనం

KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 17, 2025
10:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కావడంతో క్రికెట్ ప్రేమికులు ఉత్సాహంగా ఉన్నా, వర్షం వారి ఆశలకు నీళ్లు చల్లింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మేఘాలు ముసురుకుని కుండపోతగా వర్షం కురవడంతో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ - కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ రద్దుకావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
13 మ్యాచ్‌లు ఆడి కేవలం 12 పాయింట్లు మాత్రమే సాధించిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
మరోవైపు, 17 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉన్నప్పటికీ, ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం అయిపోయినట్టే.