Page Loader
IPL Mega Auciton: మరికొన్ని గంటల్లో మెగా వేలం.. హాట్ ఫేవరెట్స్ ఎవరో తెలుసుకోండి!
మరికొన్ని గంటల్లో మెగా వేలం.. హాట్ ఫేవరెట్స్ ఎవరో తెలుసుకోండి!

IPL Mega Auciton: మరికొన్ని గంటల్లో మెగా వేలం.. హాట్ ఫేవరెట్స్ ఎవరో తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఫ్రాంచైజీలు తమ గెలుపు గుర్రాల కోసం పోటీపడనున్న ఈ వేలం నవంబర్ 24న మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్ వరకు పది ఫ్రాంచైజీల యజమానులు ఇప్పటికే జెడ్డాకు చేరుకొని, తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. వేలంలో 574 మంది ఆటగాళ్లు 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, ఫైనల్ లిస్ట్‌లో 574 మంది మాత్రమే నిలిచారు. వారిలో 81 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల కనీస ధరకే వేలం పాటకు వస్తున్నారు.

Details

రిషబ్ పంత్ పై అందరి దృష్టి

భారతీయులు 366 మంది ఉండగా, 208 మంది విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, ఇషాన్ కిషన్, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వికెట్ కీపింగ్‌తో పాటు విధ్వంసక బ్యాటింగ్ నైపుణ్యం కలిగిన వారిని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు పోటీపడడం ఖాయం. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 17వ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా భారీ డిమాండ్ ఉండనుంది. రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న ఆటగాళ్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, చాహల్, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్

Details

ఎవరి దగ్గర ఎంత ఉందంటే? 

పంజాబ్ కింగ్స్ : రూ.110.5 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : రూ.83 కోట్లు దిల్లీ క్యాపిటల్స్ : రూ.73 కోట్లు, గుజరాత్ టైటాన్స్ & లక్నో సూపర్ జెయింట్స్ : రూ.69 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ : రూ.55 కోట్లు - కోల్‌కతా నైట్ రైడర్స్ : రూ.51 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ & ముంబై ఇండియన్స్ : రూ.45 కోట్లు - రాజస్థాన్ రాయల్స్ : రూ.41 కోట్లు 17వ సీజన్‌లో మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో రికార్డు సృష్టించాడు. ఈసారి ఈ రికార్డు బద్దలు కొట్టే క్రికెటర్ ఎవరో అనేది ఆసక్తిగా మారింది.