Tilak Varma: కేకేఆర్ మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదు చేసిన తిలక్ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్'తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో తిలక్ క్రీజ్‌లోకి వచ్చాడు. జట్టును నిలబెట్టాల్సిన బాధ్యత అతడిపై ఉన్నా.. నెమ్మదైన ఇన్నింగ్స్‌తో విమర్శలు ఎదుర్కొన్నాడు. మొదటి నుంచే నెమ్మదిగా ఆడిన తిలక్ వర్మ.. కేకేఆర్ బౌలర్లకు ఎదురుదాడి చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఎక్కువగా డాట్ బాల్స్, సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. ముంబై ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో వరుణ్ చక్రవర్తి క్యాచ్‌ను వదిలేయడంతో అతడు ఔట్ కాకుండా తప్పించుకున్నాడు.
వివరాలు
హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం
ఆ తర్వాత సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఒక భారీ సిక్సర్ బాదిన తిలక్.. మళ్లీ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. చివరకు కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్ వర్మ.. తొలి బౌండరీ కొట్టడానికి ఏకంగా 25 బంతులు తీసుకున్నాడు. ఈ సీజన్‌లో ఒక బ్యాటర్ తొలి ఫోర్ కొట్టడానికి తీసుకున్న అత్యధిక బంతులు ఇవే. గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రవీంద్ర జడేజా 24 బంతుల తర్వాత తొలి బౌండరీ నమోదు చేశాడు.
వివరాలు
14 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు చేసిన తిలక్ వర్మ
కేకేఆర్‌పై తిలక్ వర్మ 32 బంతుల్లో కేవలం 20 పరుగులే చేశాడు. ఇందులో ఒక సిక్సర్ మాత్రమే ఉంది. అతడి స్ట్రైక్‌రేట్ 62.50. క్రిక్‌బజ్ గణాంకాల ప్రకారం.. ఐపీఎల్‌లో 30కి పైగా బంతులు ఎదుర్కొని ఇంత తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన బ్యాటర్ 2012 తర్వాత మళ్లీ ఇప్పుడు కనిపించాడు. అప్పట్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ.. రాజస్థాన్ రాయల్స్‌పై 32 బంతుల్లో 19 పరుగులు చేసి 59.37 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు.