Page Loader
Cricket Australia:ఛాంపియన్స్ ట్రోఫీకి కొత్త కెప్టెన్‌.. ఐదు మార్పులతో స్క్వాడ్‌ ని ప్రకటించిన ఆస్ట్రేలియా 
ఛాంపియన్స్ ట్రోఫీకి కొత్త కెప్టెన్‌.. ఐదు మార్పులతో స్క్వాడ్‌ ని ప్రకటించిన ఆస్ట్రేలియా

Cricket Australia:ఛాంపియన్స్ ట్రోఫీకి కొత్త కెప్టెన్‌.. ఐదు మార్పులతో స్క్వాడ్‌ ని ప్రకటించిన ఆస్ట్రేలియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా పరిస్థితి ఇప్పుడు అనిశ్చితంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) సమీపిస్తుండగా, ఆ జట్టు గాయాలు, అనివార్య కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, ఐదు ప్రధాన మార్పులతో ఆసీస్ జట్టు స్క్వాడ్‌ను ప్రకటించాల్సి వచ్చింది. స్టీవ్ స్మిత్‌ నాయకత్వంలో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్, ప్రముఖ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల కారణంగా తప్పుకున్నారు. తొలుత ఎంపికైన మార్కస్ స్టాయినిస్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇక, మరో ఆటగాడు మిచెల్ స్టార్క్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు.

వివరాలు 

శ్రీలంకతో రెండు వన్డేలకు  స్టార్క్ దూరం 

శ్రీలంకతో జరగనున్న రెండు వన్డేలకు కూడా అందుబాటులో ఉండడంలేదని స్టార్క్ వెల్లడించాడు. కానీ, అతడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో ఇంకా స్పష్టత లేదు. స్టార్క్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఆసీస్ మేనేజ్‌మెంట్ ప్రకటించడంతో పాటు ఐదు కీలక మార్పులతో కొత్త జట్టును ప్రకటించింది. "మిచెల్ స్టార్క్‌ పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాం. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్‌ పట్ల అతని నిబద్ధత అసాధారణం. ఎన్నో మ్యాచుల్లో ఆసీస్ విజయాల్లో అతని పాత్ర అపూర్వమైనది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతను లేరు అనే అంశం మాకు నష్టం. కానీ, కొత్త పేసర్‌ కోసం ఇది ఒక మంచి అవకాశం" అని చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నారు.

వివరాలు 

ఆసీస్‌ స్క్వాడ్‌ 

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కేరీ, బెన్ డ్వారిషూస్, నాథన్‌ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సన్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్‌ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. ట్రావెల్ రిజర్వ్‌: కూపర్ కొన్నోల్లీ