Page Loader
Mohammed Shami: బెంగళూరు స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్నమహ్మద్ షమీ! 
బెంగళూరు స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్నమహ్మద్ షమీ!

Mohammed Shami: బెంగళూరు స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్నమహ్మద్ షమీ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 18, 2024
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్‌ పేసర్ మహ్మద్ షమీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మెరిశాడు. అతడికి గాయమైంది కదా? మరి అక్కడ ఏమి చేస్తున్నాడనే అనుమానం కలగడం సహజమే. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత షమీ నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. మోకాలిలో వాపు కారణంగా అతడు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్నాడు, అక్కడి నుండే సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బ్యాండేజీతోనే బౌలింగ్‌ ప్రాక్టీస్ చేశాడు.వంద శాతం ఫిట్‌నెస్‌ ఉన్న బౌలర్‌గానే బంతులను వేస్తున్నాడని కథనాలు వస్తున్నాయి. ఎన్‌సీఏలో తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడని,కోలుకుంటున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు 

త్వరలోనే వస్తాడా? 

నెట్స్‌లో తొలుత తక్కువ రన్నప్‌తో నెమ్మదిగా వేయడం ప్రారంభించిన షమీ, తరువాత వేగాన్ని పెంచుకుంటూ వెళ్లాడని తెలిసింది. ఎన్‌సీఏ బౌలింగ్‌ కోచ్‌ ట్రాయ్ కూలే సమక్షంలో బౌలింగ్‌ను ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్‌ తర్వాత, షమీ తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాదాపు ఎనిమిది నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం అందరూ అతను అందుబాటులో వస్తాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్,ఫామ్‌ను నిరూపించుకోవాలని షమీ నిర్ణయించాడు.

వివరాలు 

 శస్త్రచికిత్స చేయించిన ప్రదేశంలో వాపు 

అయితే,నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మోకాలిలో నొప్పి అనిపించడంతో వైద్య బృందాన్ని కలిశాడు. అక్కడ శస్త్రచికిత్స చేయించిన ప్రదేశంలో వాపు ఏర్పడిందని గుర్తించారు. దీంతో అతడిని ఆస్ట్రేలియా సిరీస్‌కు తీసుకెళ్లడం కష్టమని కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్న షమీ, ఎలాగైనా జాతీయ జట్టులోకి రావాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.