Mohammed Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ స్పెషల్ రికార్డు.. ఏంటో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు.వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన అనంతరం ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో షమీ సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, జాకీర్ అలీ వికెట్లు పడగొట్టాడు.
ఈ విజయంతో వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ పరంగా) 200 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇదివరకే ఈ రికార్డును కలిగిన అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ రికార్డులను అధిగమించాడు.
అగార్కర్ 133 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, షమీ కేవలం 103 ఇన్నింగ్స్‌ల్లోనే 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
వివరాలు
వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్లు:
మహ్మద్ షమీ - 103 ఇన్నింగ్స్‌లు
అజిత్ అగార్కర్ - 133 ఇన్నింగ్స్‌లు
జహీర్ ఖాన్ - 144 ఇన్నింగ్స్‌లు
అనిల్ కుంబ్లే - 147 ఇన్నింగ్స్‌లు
జవగల్ శ్రీనాథ్ - 147 ఇన్నింగ్స్‌లు
కపిల్ దేవ్ - 166 ఇన్నింగ్స్‌లు
ఓవరాల్‌గా చూస్తే, షమీ వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
ఈ ఘనతను పాకిస్థాన్ బౌలర్ సక్లైన్ ముస్తాక్ (104 మ్యాచ్‌లు) సమం చేశాడు.
అయితే, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.
వివరాలు
వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు:
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) - 102 మ్యాచ్‌లు
సక్లైన్ ముస్తాక్ (పాకిస్థాన్) - 104 మ్యాచ్‌లు
మహ్మద్ షమీ (భారత్) - 104 మ్యాచ్‌లు
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) - 107 మ్యాచ్‌లు
బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) - 112 మ్యాచ్‌లు
అలన్ డొనాల్డ్ (దక్షిణాఫ్రికా) - 117 మ్యాచ్‌లు
వివరాలు
అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు:
5126 బంతుల్లో మహ్మద్ షమీ ఈ ఘనత సాధించగా,
మిచెల్ స్టార్క్ 5240 బంతుల్లో,
సక్లైన్ ముస్తాక్ 5451 బంతుల్లో,
బ్రెట్ లీ 5640 బంతుల్లో ఈ రికార్డును అందుకున్నారు.
వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు:
అనిల్ కుంబ్లే - 334 వికెట్లు
జవగల్ శ్రీనాథ్ - 315 వికెట్లు
అజిత్ అగార్కర్ - 288 వికెట్లు
జహీర్ ఖాన్ - 269 వికెట్లు
హర్భజన్ సింగ్ - 265 వికెట్లు
కపిల్ దేవ్ - 253 వికెట్లు
రవీంద్ర జడేజా - 226 వికెట్లు
మహ్మద్ షమీ - 200* వికెట్లు