Page Loader
Mohammed Shami: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి షమీ దూరమైనట్టు వార్తలు.. అవన్నీ రూమర్స్: మహ్మద్‌ షమి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి షమీ దూరమైనట్టు వార్తలు.. అవన్నీ రూమర్స్: మహ్మద్‌ షమి

Mohammed Shami: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి షమీ దూరమైనట్టు వార్తలు.. అవన్నీ రూమర్స్: మహ్మద్‌ షమి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2024
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా సీనియర్‌ పేసర్ మహ్మద్ షమీ గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి అతడు విశ్రాంతి తీసుకున్నాడు.ఐపీఎల్‌ 2024 సీజన్‌లోనూ ఆడలేదు. ఇప్పుడెప్పుడో టీమిండియాలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రాక్టీస్ చేస్తున్న షమి, రంజీ ట్రోఫీలో ఆడి ఫిట్‌నెస్‌ నిరూపించి ఆసీస్‌ టెస్టు (IND vs AUS) సిరీస్‌ నాటికి సిద్ధం కావాలనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే,ఈ క్రమంలో షమి మోకాలిలో సమస్య మళ్లీ ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అతడు ఖండించాడు. అవన్నీ కేవలం రూమర్స్‌ అని అతడు ప్రకటించాడు.

వివరాలు 

షమి వేగంగా కోలుకుంటున్నాడు: బీసీసీఐ 

ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, "ఇలాంటి నిరాధారమైన రూమర్స్‌ ఎందుకు? నేను రికవరీ అవడానికి ఎంతో కష్టపడుతున్నాను.బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు బీసీసీఐ కానీ, నేను కానీ చెప్పలేదు. ఇలాంటి ఆధారాలు లేని వార్తలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయకండి" అని పేర్కొన్నాడు. మరోవైపు, బీసీసీఐ వర్గాలు షమి వేగంగా కోలుకుంటున్నాడని తెలిపాయి.అతడి పురోగతిని బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ నెలలో కివీస్‌తో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఆడాలని షమి కష్టపడుతున్నాడని వెల్లడించాయి. కివీస్‌తో సిరీస్‌ నాటికి ఫిట్‌గా లేకపోతే,నవంబర్‌లో ప్రారంభమవుతున్న బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీ ద్వారా షమి పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయి.

వివరాలు 

హ్యాట్రిక్ లక్ష్యంగా టీమిండియా 

ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 22 నుంచి మొదలవనున్న ఐదు టెస్టుల సిరీస్‌ పేస్‌ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై షమి కీలక పాత్ర పోషిస్తాడని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. బుమ్రా, సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌తోపాటు షమి జట్టులో ఉంటే పేస్‌ ఎటాక్‌ మరింత బలంగా ఉండనుంది. టీమిండియా ఆస్ట్రేలియాపై వరుసగా రెండుసార్లు ఈ సిరీస్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో, మూడోసారి కూడా కంగారులను ఓడించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.