IPL : ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సార్లు డకౌట్లైనా ప్లేయర్లు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గురించి చెప్పుకునే సమయంలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వేగం.
బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా, ప్రతిదీ అతివేగంగా జరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్ పేరుగాంచింది.
ఇందులో అనేక మంది స్టార్ క్రికెటర్లు తమ ప్రతిభతో అనేక రికార్డులు సృష్టించారు.
ఇందులో కొన్ని విశేషమైన రికార్డులే కాదు, ఆశ్చర్యకరమైన చెత్త రికార్డులు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్లను నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో కొంతమంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. టాప్ 4 స్థానాల్లో ఉన్న ఆటగాళ్లను పరిశీలిద్దాం.
వివరాలు
4. పియూష్ చావ్లా (16 డకౌట్లు)
భారత లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి 2013 వరకు ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు.
2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో చేరిన ఆయన, ఫైనల్ మ్యాచ్‌లో తన అద్భుత ప్రదర్శనతో పంజాబ్‌ను ఓడించి KKRకు రెండో టైటిల్ అందించాడు.
ఐపీఎల్‌లో మొత్తం 192 మ్యాచ్‌లు ఆడిన పియూష్ చావ్లా, 16 సార్లు డకౌట్ అయ్యాడు.
వివరాలు
3. రోహిత్ శర్మ (17 డకౌట్లు)
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుని, కెప్టెన్‌గా ఎంఎస్ ధోనితో సమాన స్థాయిలో నిలిచాడు.
2009లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న డెక్కన్ ఛార్జర్స్ జట్టులో కూడా రోహిత్ సభ్యుడు.
బ్యాట్స్‌మన్‌గా కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడైన రోహిత్, 257 మ్యాచ్‌లలో 29.72 సగటుతో 6628 పరుగులు సాధించాడు.
ఇందులో 43 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 17 గోల్డెన్ డకౌట్లు నమోదు చేసి, మూడో స్థానంలో ఉన్నాడు.
వివరాలు
2. గ్లెన్ మాక్స్‌వెల్ (18 డకౌట్లు)
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.
అయితే,ఆ జట్టు తరఫున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.2013లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరినా,అక్కడ కూడా మూడు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు.
2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఇప్పుడు పంజాబ్ కింగ్స్) తరఫున అసాధారణ ప్రదర్శన కనబరిచిన మాక్స్‌వెల్, ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.
ఇప్పటి వరకు 134 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి, 24.74 సగటుతో 2771 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 156.73 కాగా, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, 18 సార్లు డకౌట్ అయ్యి రెండో స్థానంలో నిలిచాడు.
వివరాలు
1. దినేష్ కార్తీక్ (18 డకౌట్లు)
భారత వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే, 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే లీగ్‌లో ఆడుతున్న ఆటగాళ్లలో ఒకడైన కార్తీక్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టుతో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.
2024 ఐపీఎల్ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో ముగించాడు.
ఇప్పటివరకు 257 మ్యాచ్‌లు ఆడి, 26.31 సగటుతో 4842 పరుగులు సాధించాడు. ప్రత్యేకించి, ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడినా, ఫినిషర్‌గా కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన కార్తీక్, ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 18 సార్లు డకౌట్ అయ్యి అగ్ర స్థానంలో నిలిచాడు.