Page Loader
PSL: టీ20ల్లో అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్
విజయం సాధించిన ముల్తాన్ సుల్తాన్స్

PSL: టీ20ల్లో అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2023
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సంచలన రికార్డులు నమోదవుతున్నాయి. మ్యాచ్ స్కోర్లు 200 ప్లస్ దాటినా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్‌ను చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీల మధ్య జరిగిన మ్యాచ్‌లో చరిత్రాత్మక రికార్డు అవిష్కరించబడింది. ముల్తాన్ సుల్తాన్స్ తరుపున రిలీ రూసో 121 పరుగులతో రాణించడంతో పెషావర్ జల్మీ చేసిన 243 పరుగుల భారీ స్కోరును చేధించింది. ఈ విజయంతో ముల్తాన్ సుల్తాన్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. T20 క్రికెట్‌లో 2018లో న్యూజిలాండ్‌ కొట్టిన 244 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మాత్రమే విజయవంతంగా ఛేదించింది.

రూసో

బౌండరీల వర్షం కురిపించిన రూసో, కీరన్ పోలార్డ్

షెషావర్‌జల్మీ, క్వెటాగ్లాడియేటర్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఫెషావర్‌జల్మీ ఓడిపోయింది. పెషావర్‌ను 20 ఓవర్లలో 240/2 భారీ స్కోరును చేసింది. క్వెట్టా‌గ్లాడియేటర్స్ టీమ్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఊది పాడేసింది తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ బాబార్ 39 బంతుల్లోనే 73 పరుగులు, సయామ్‌ అయుబ్‌ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. లక్ష్య చేధనకు దిగిన ముల్తాన్‌కు అదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు మసూద్ (5), రిజ్వాన్ (7)లు వెంటవెంటేనే పెవిలియన్ చేరారు. అనంతరం రూసో.. కీరన్ పొలార్డ్ బౌండరీల వర్షం కురిపించడంతో సుల్తాన్స్ విజయం సాధించింది.