Page Loader
Rohit Sharma: ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ జట్టన్న హార్దిక్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ!
ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ జట్టన్న హార్దిక్.. స్ట్రాంగ్ రిప్లే ఇచ్చిన రోహిత్ శర్మ!

Rohit Sharma: ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ జట్టన్న హార్దిక్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2023
06:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma) స్థానంలో హర్థిక్ పాండ్యా(Hardik Pandya)ను నియమించడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. పదేళ్ల పాటు జట్టును విజయవంతంగా నడిపించిన హిట్ మ్యాన్ ను మార్చడంపై అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేయడం గమనార్హం. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాలో రోహిత్, హార్దిక్ బిన్న వాదనలతో కూడిన వీడియోలను షేర్ చేయడంతో మరింత అగ్గి రాజుకుంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ముంబై జట్టుపై హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు.

Details

ప్లేయర్ల కృషి గురించి ఎవరూ మాట్లడరు: రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ జట్టులో స్టార్ ప్లేయర్లు ఎక్కువగా ఉన్నారని, ఫలితంగా టైటిల్స్ గెలుచుకోవడంలో వాళ్లకు ఈజీ అవుతుందని హార్దిక్ పేర్కొన్నారు. అయితే హార్దిక్ వ్యాఖ్యలకు భిన్నంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ముంబై బలమైన ప్లేయర్స్‌తో ఉందని ప్రజలు అనుకుంటారని, దాని వెనుక ఉన్న కృషి గురించి ఎవరూ మాట్లాడరని పేర్కొన్నాడు. తిలక్ వర్మ, నేహాల్ కథ.. బుమ్రా, హార్ధిక్ లాగే ఉంటుందని, కొన్ని సంవత్సరాల తర్వాత తమకు బలమైన జట్టు ఉందని ఎవరైనా చెబుతారంటూ రోహిత్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.