Page Loader
World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచుకు నరేంద్ర మోదీ.. ప్రారంభానికి ముందు వాయుసేన ఎయిర్ షో
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచుకు నరేంద్ర మోదీ.. ప్రారంభానికి ముందు వాయుసేన ఎయిర్ షో

World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచుకు నరేంద్ర మోదీ.. ప్రారంభానికి ముందు వాయుసేన ఎయిర్ షో

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2023
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచు కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మకమైన మ్యాచును చూసేందుకు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచు కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలో ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే పోరును వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించారు. మరోవైపు క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచుకు హాజరవుతారని సమాచారం.

Details

తొమ్మిది ఎయిర్ క్రాప్ట్‌లతో ప్రత్యేక ప్రదర్శన

ఈ మ్యాచ్ ముంగిట భారత వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయనుంది. ఈ విషయాన్ని గుజరాత్ కు చెందిన డిఫెన్స్ పీఆర్వో గురువారం స్పష్టం చేసింది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు మొత్తం తొమ్మిది ఎయిర్ క్రాప్ట్‌లు రకరకాల ఆకారలతో అబ్బురపరుచనున్నాయి. మరో వైపు గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా ప్రదర్శన ఇస్తున్నట్లు సమాచారం .