Page Loader
Neeraj Chopra: 'నాకు దేశమే ముందు'.. పాకిస్తానీ అర్షద్ నదీమ్ పిలుపుకు స్పందించిన నీరజ్ చోప్రా 
పాకిస్తానీ అర్షద్ నదీమ్ పిలుపుకు స్పందించిన నీరజ్ చోప్రా

Neeraj Chopra: 'నాకు దేశమే ముందు'.. పాకిస్తానీ అర్షద్ నదీమ్ పిలుపుకు స్పందించిన నీరజ్ చోప్రా 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా పాకిస్థాన్ జావెలిన్ త్రో అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించడం పట్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పహల్గాం ఉగ్రవాద ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో, ఇలాంటి సమయంలో పాక్ క్రీడాకారుడిని ఆహ్వానించడం అవసరమా అనే అభిప్రాయాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. మే నెలలో బెంగళూరులో జరగబోయే ఎన్‌సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్ కోసం అర్షద్‌ను ఆహ్వానించడంపై నీరజ్‌కు తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నీరజ్ చోప్రా, తాను కూడా ఆర్మీలో భాగమని గుర్తు చేస్తూ, తన కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు బాధ వ్యక్తం చేశాడు.

వివరాలు 

అర్షద్‌ను ఆహ్వానించాలనే నిర్ణయం పహల్గాం ఉగ్రదాడికి ముందే తీసుకున్నది 

"సాధారణంగా నేను తక్కువగా మాట్లాడుతాను. కానీ, తప్పు అనిపించినప్పుడు మాత్రం నేను మౌనం పాటించను. దేశంపై నాకు ఉన్న ప్రేమ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గను. అదే విధంగా నా కుటుంబానికి గౌరవం ఇవ్వడం నా బాధ్యత. నేను అర్షద్ నదీమ్‌ను ఆహ్వానించాను కేవలం ఒక అథ్లెట్‌గా మాత్రమే. ఇందులో మరే విధమైన ఉద్దేశం లేదు. ఎన్‌సీ క్లాసిక్ ఈవెంట్ లక్ష్యం ప్రపంచ స్థాయిలో ఉన్న అథ్లెట్లను భారత్‌కు తీసుకురావడం. మనం కూడా అద్భుతమైన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు నిర్వహించగలమని చూపించడమే దీని ఉద్దేశం" అని నీరజ్ చోప్రా రాసుకొచ్చారు. అతను తెలిపిన వివరాల ప్రకారం, అర్షద్‌ను ఆహ్వానించాలనే నిర్ణయం పహల్గాం ఉగ్రదాడికి ముందే తీసుకున్నట్లు తెలిపారు.

వివరాలు 

 దేశ ప్రయోజనాలే నాకు మొదటి ప్రాధాన్యత

"ఈ నిర్ణయం సోమవారం ముందు తీసుకున్నాం.పహల్గాం ఘటన తర్వాత కేవలం 48 గంటల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అర్షద్ ఎన్‌సీ క్లాసిక్‌ ఈవెంట్‌లో పాల్గొనలేడన్నదే ఇప్పుడు వాస్తవం. ఎప్పుడైనా నా దేశ ప్రయోజనాలే నాకు మొదటి ప్రాధాన్యత. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన దేశ ప్రజలను కోల్పోయిన బాధ నాకు ఉంది. వారి కుటుంబాలకు నా పూర్తి మద్దతు ఉంది. ఈ ఘటన పట్ల నాకూ బాధ, కోపం రెండూ ఉన్నాయి"అని పేర్కొన్నారు.

వివరాలు 

తనపై వస్తున్న విమర్శలపై ఆవేదనతో స్పందించిన నీరజ్

"దేశ గర్వంగా భావించేలా గత కొన్నేళ్లుగా ఎంతో కష్టపడుతున్నాను. అయినా కూడా నా చిత్తశుద్ధిని ప్రశ్నించడం బాధాకరం. నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు ఎదురైంది. మేమంతా సాధారణంగా జీవించే ప్రజలమే. అర్థం లేని అపోహలు కలిగించవద్దు. కొన్ని మీడియా సంస్థలు కూడా తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. నేను స్పందించనందున ఈ విషయంలో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడ్డాయి" అని అన్నారు.

వివరాలు 

భారత్‌కు గౌరవం తీసుకురావాలన్నదే నా లక్ష్యం

"ఇదే ప్రజలు, గతంలో నా తల్లి అమాయకంగా చెప్పిన మాటను ప్రశంసించారు. ఇప్పుడు అదే మాటలను నాకు వ్యతిరేకంగా ఉపయోగించడంలో ఒక బాధ ఉంది. నేను ఎక్కడికెళ్లినా భారత్‌కు గౌరవం తీసుకురావాలన్నదే నా లక్ష్యం. విమర్శలు కూడా సరైన కారణాలతో వస్తే గౌరవించదగ్గవే. జై హింద్." ఈ ప్రకటనను నీరజ్ చోప్రా సోష‌ల్ మీడియా వేదికగా సుదీర్ఘంగా షేర్ చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నీరజ్ చోప్రా చేసిన ట్వీట్