IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్.. మొదటి టెస్టుకుకీలక ఆటగాడు దూరం
భారత్ ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. దీని చివరి మ్యాచ్ అక్టోబర్ 12న జరగనుంది. అనంతరం, అక్టోబర్ 16 నుంచి భారత్‌లోనే న్యూజిలాండ్‌తో రోహిత్ సేన టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు త్వరలోనే భారత్ చేరుకోనుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉంది.
మొదటి టెస్టుకు మార్క్ చాప్‌మన్
కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా మొదటి టెస్టు నుంచి దూరంగా ఉన్నాడు. అతడికి ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టులో గజ్జల్లో గాయం అయింది. కానీ, రెండో టెస్టుకు ఆయన అందుబాటులో ఉంటాడని అంచనా. ప్రస్తుతం పునరావాసంలో ఉన్న కేన్, భారత్‌కు ఆలస్యంగా చేరుకోనున్నాడు. అతడి స్థానంలో మార్క్ చాప్‌మన్‌ను మొదటి టెస్టుకు ఎంపిక చేశారు. మైఖేల్ బ్రేస్‌వెల్ మొదటి టెస్టు ఆడిన తరువాత స్వదేశానికి తిరిగి వెళ్లిపోనున్నాడు, ఆ తర్వాత అతని స్థానంలో ఇష్ సోధిని ఎంపిక చేశారు.
న్యూజిలాండ్ జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.