Champions Trophy: సెన్సేషనల్ ఫామ్‌లో న్యూజిలాండ్.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ క్రికెట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
తాజాగా పాకిస్థాన్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లను వెనక్కి నెట్టి అజేయంగా టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఈ విజయంతో 2000 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసింది.
ఏడుగురు ఆల్ రౌండర్లు - కివీస్ బలం
సాధారణంగా ప్రతి జట్టులో ఒకరు లేదా అత్యధికంగా ముగ్గురు ఆల్ రౌండర్లు ఉంటారు. అయితే న్యూజిలాండ్ ఈసారి ప్రకటించిన 15 మంది స్క్వాడ్‌లో ఏకంగా ఏడుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు.
ఇది ఆ జట్టు బలాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
Details
అద్భుత ఫామ్‌లో కేన్ విలియమ్సన్
ఈ జట్టులో కెప్టెన్ మిచెల్ శాంట్నర్, బ్రాస్ వెల్, చాప్ మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నేథన్ స్మిత్ వంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. వీరి ప్రదర్శన కివీస్ విజయాల్లో కీలకంగా మారనుంది.
ఇక కేన్ విలియమ్సన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ 7000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
విల్ యంగ్, డెవాన్ కాన్వే కూడా మెరుగైన ఫామ్‌లో ఉన్నారు.
బ్యాటింగ్ లైనప్‌లో మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్ వంటి ఆటగాళ్లు ఉండటంతో 300కు పైగా పరుగులు చేయడం అలవాటుగా మారింది.
Details
పేస్ బౌలింగ్ లో బలహీనత
శాంట్నర్ నాయకత్వంలో స్పిన్ విభాగం కూడా మెరుగ్గా ఉంది. న్యూజిలాండ్ బలమైన జట్టే అయినా పేస్ బౌలింగ్ అనుభవం కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది.
ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ రిటైర్మెంట్ వల్ల జట్టు బలహీనమైంది. లాకీ ఫెర్గూసన్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు.
యువ ప్లేయర్లు జేకబ్ డఫీ, ఒరోర్క్, నేథన్ స్మిత్ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ముక్కోణపు సిరీస్‌లో గాయపడ్డ రచిన్ రవీంద్ర ఫిట్‌నెస్ పరిస్థితిపై ఇంకా సందేహాలు ఉన్నాయి.
Details
కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుస్తుందా?
అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే చాలా గొప్ప విజయాలు సాధించింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి యువ ఆటగాళ్లపై భారీ భారం ఉండనుంది.
ఆల్ రౌండర్ల బలం, పేస్ లోపాన్ని తట్టుకుని జట్టు ఎలా ఆడుతుందో చూడాలి!
న్యూజిలాండ్ జట్టు
కాన్వే, లేథమ్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), బ్రాస్ వెల్, చాప్ మన్, డరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నేథన్ స్మిత్, జాకబ్ డఫీ, ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, విల్ ఒరోర్క్