NZ Vs BAN : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మరో అసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఇవాళ చైన్నైలోని చెపాక్ వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లా, మరో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక న్యూజిలాండ్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచులో బరిలోకి దిగనున్నాడు. కేన్ కివీస్ జట్టులో చేరడంతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం మరింత పటిష్ఠంగా మారింది.
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్టులోని సభ్యులు
న్యూజిలాండ్ జట్టు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (సి), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ బంగ్లాదేశ్ జట్టు లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(సి), ముష్ఫికర్ రహీమ్(w), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్