Page Loader
Nita Ambani: నీతా అంబానీ ప్రత్యేక విందు.. హాజరైన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ క్రీడాకారులు  
నీతా అంబానీ ప్రత్యేక విందు.. హాజరైన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ క్రీడాకారులు

Nita Ambani: నీతా అంబానీ ప్రత్యేక విందు.. హాజరైన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ క్రీడాకారులు  

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2024
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ వారందరిని ప్రత్యేకంగా సత్కరించారు. ఆమె ముంబైలోని తన నివాసం ఆంటీలియాలో వారందరికీ ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 'యునైటెడ్ ఇన్ ట్రయుఫ్' పేరుతో ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకలో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొన్న 140 మంది క్రీడాకారులు, అథ్లెట్లు హాజరయ్యారు.

Details

భారత్ కీ షాన్ అంటూ ఛాంపియన్లను పరిచయం చేసిన నీతా అంబానీ

ఈ వేడుకలో డబుల్ మెడలిస్ట్ మను బాకర్, నీరజ్ చోప్రా, హాకీ స్టార్ గోల్‌కీపర్ శ్రీజేశ్ సహా పారాలింపిక్ విజేతలు సింగ్, మోనా అగర్వాల్ వంటి ప్రముఖ క్రీడాకారులు అంబానీ అందించిన ప్రత్యేక ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా, భారత్‌ కీ షాన్ అంటూ ఛాంపియన్లను నీతా అంబానీ పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హజరైన క్రీడాకారులు