IND Vs AUS: విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు : శ్రేయస్ అయ్యర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది.
ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ విజృంభించడంతో భారత్ 399/5 స్కోరు సాధించింది.
ఈ మ్యాచులో శ్రేయస్ అయ్యర్(105) సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో వరల్డ్ కప్ జట్టులో శ్రేయస అయ్యర్ స్థానానికి ఎటువంటి ఢోకా లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రెండో వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ అసక్తికర వ్యాఖ్యలను చేశాడు.
Details
అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు : శ్రేయస్
క్రీడల్లో ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణం తప్పదని, ప్రస్తుతం సెంచరీ సాధించడం సంతోషంగా ఉందని, తనకు మద్దతుగా నిలిచిన సహచరులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలని శ్రేయస్ పేర్కొన్నారు.
గాయాలు తనను చాలా ఇబ్బంది పెట్టాయని, తనపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తన లక్ష్యమెంటో తనకు తెలుసు అని, వాటి కోసం కష్టపడుతున్నానని చెప్పారు.
జట్టు కోసం ఎలాంటి స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని, కానీ నెంబర్ 3 స్థానం మాత్రం విరాట్ కోహ్లీదేనని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒక్కరని శ్రేయస్ చెప్పుకొచ్చారు.